ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీకి తన తెగ నుండి బహిష్కరణ ఎదురైంది. భాత్రా గిరిజన తెగకు చెందిన ఆయన ఇటీవల కులాంతర వివాహం చేసుకోవడం పట్ల తెగ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు భాత్రా సంఘం తీర్మానం చేసి, ప్రదీప్ మాఝీ కుటుంబాన్ని 12 సంవత్సరాల పాటు సామాజికంగా బహిష్కరించనున్నట్లు ప్రకటించింది.
సామాజిక బహిష్కరణ
భాత్రా తెగ నేతల ప్రకటన మేరకు, ఈ సమయంలో ప్రదీప్ మాఝీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యాలకూ భాత్రా తెగ ప్రజలు హాజరుకావద్దని, అదేవిధంగా మాఝీ కుటుంబసభ్యులు కూడా తెగ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం కేవలం ప్రదీప్ మాఝీ మాత్రమే కాకుండా, ఆయన సోదరి సంజూ మాఝీకి కూడా వర్తిస్తుందని తెలిపారు. సంజూ మాఝీ కూడా బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న కారణంగా, తెగ నుండి ఆమెను కూడా బహిష్కరించనున్నట్లు భాత్రా సంఘం స్పష్టం చేసింది.
వివాహం, వివాదం
ఒడిశాలోని నబరంగ్పూర్ నియోజకవర్గం నుండి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన ప్రదీప్ మాఝీ, ఇటీవల బిజూ జనతాదళ్ (BJD)లో చేరారు. ఇటీవల, గోవాలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుశ్రీ సంగీత సాహూతో వివాహం చేసుకున్నారు. ఇది తెగ నియమాలకు విరుద్ధమని భావించిన భాత్రా తెగ పెద్దలు, ఆయనపై సామాజిక చర్య తీసుకున్నారు.
తెగ సభ్యులు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇది అనాగరిక చర్యగా అభివర్ణిస్తుండగా, మరికొందరు భాత్రా తెగ సంప్రదాయాలకు ఇది తగిన చర్య అని మద్దతు తెలిపారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రదీప్ మాఝీ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వివాదం ప్రదీప్ మాఝీ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
प्रिय प्रदीप एवं सुश्री आपका विवाह ईश्वर के प्रेम और कृपा का प्रमाण है, जीवन के इस नए अध्याय में आपको ढेर सारी खुशियां मिलें |
प्रभु का आशीर्वाद आप दोनों के जीवन को भर दे ।@bjdpradeep pic.twitter.com/ZcaCAaiQoA
— Ashwani Dubey (@ashwani_dube) March 12, 2025