స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఇంటర్నెట్ వినియోగం ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. టెక్నాలజీ వైపు పరుగులు తీయడానికి మెయిన్ రీజన్ అయిన ఇంటర్నెట్ (Internet) సాయంతో అరచేతిలో ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు మనిషి. దీంతో ప్రతి చిన్న విషయానికి ఇంటర్నెట్ పైనే ఆధారపడిపోయాడు. ఇంట్లో గ్రోసరీస్ అయిపోయాయన్నా.. తెలియని కొత్త ప్లేస్‌కు వెళ్లాలన్నా.. మనసుకు నచ్చిన మ్యూజిక్ వినాలన్నా.. కొత్త రెసిపీతో అందరికీ సర్ఫ్రైజ్ చేయాలన్నా.. అంతెందుకు ఒకప్పుడు అసలు ఈ ఇంటర్నెట్ లేకుండా ఎలా బతికేరురా బాబూ అన్నట్లుగా.. ప్రతీ పనికి దానిపైనే ఆధారపడిపోయాడు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ.. అందరికీ షాకింగ్‌గా ఉంది.
మరో రెండేళ్లలో ఇంటర్నెట్ కుప్పకూలిపోనుందంటూ.. ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2025 నాటికి సూర్యుడు ‘సోలార్ మ్యాగ్జిమమ్’ (Solar maximum)కు చేరుకుంటాడు. ఆ సమయంలో సౌర తుఫానులు (Solar storms) భూమిని బలంగా తాకుతాయి. అప్పుడు ఇంటర్నెట్ వ్యవస్థ ధ్వంసం (Internet system crash) కావడం ఖాయమన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ న్యూస్‌గా మారిపోయింది. ‘సోలార్ మ్యాగ్జిమమ్’ (Solar maximum)కు డిజిటల్ ప్రపంచం సిద్ధం కాకపోవడమే దీనికి కారణమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’ (Internet Apocalypse) పేరుతో ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై చర్చ జోరందుకుంది.
నిజానికి ఇప్పటి వరకు అంత బలమైన సౌర తుఫాను భూమిని ఎప్పుడూ తాకలేదు. అయితే, 1859లో సంభవించిన ‘క్యారింగ్టన్ ఈవెంట్’ (Carrington event) మాత్రం పెను నష్టాన్నే కలిగించింది. సోలార్ సైకిల్‌లో భాగంగా జరిగిన ఈ సౌర తుఫాను హిస్టరీలో నిలిచిపోయింది. ఈ సౌర తుఫాన్ వల్ల టెలిగ్రాఫ్ లైన్స్ తెగిపోయాయి. ఎంతోమంది ఆపరేటర్లు కరెంట్ షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత మరోసారి 1989లో సంభవించిన సౌర తుఫాను వల్ల క్యుబెక్ గ్రిడ్ కొన్ని గంటల పాటు కుప్పకూలింది. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వినిపించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
తీవ్ర సౌర తుఫాను సముద్ర గర్భంలోని కమ్యూనికేషన్ కేబుళ్ల (Communication cables)పై ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనివల్ల కనెక్టివిటీ దెబ్బతినవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నష్టాల వల్ల ఒక్క రోజులోనే జరిగే నష్టం కూడా 11 బిలియన్ డాలర్ల (11 billion dollars) పైనే ఉండే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే సౌర తుఫాను వల్ల ఇంటర్నెట్ వ్యవస్థ (Internet system) అంతమైపోతుందన్న చర్చపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, నెటిజన్లు మాత్రం ఈ చర్చల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE