ఐదోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్

IPL 2020 Final: Mumbai Indians Beat Delhi Capitals By 5 wickets, Won IPL Title for the Fifth Time

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అయిదు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఈ సీజన్ ఆసాంతం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ కైవసం చేసుకుంది. అలాగే ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా ముంబయి, కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించారు. మరోవైపు చెన్నై తర్వాత వరుసగా రెండో సంవత్సరం కూడా టైటిల్‌ గెలిచిన జట్టుగా ముంబయి గుర్తింపు పొందింది.

ఫైనల్లో ముందుగా టాస్‌ గెలిచిన ఢిల్లీ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్స్ కోల్పోయి 156 పరుగులు‌ చేసింది. 22 పరుగులకే స్టోయినిస్, రహానే, ధావన్ వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టును కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(65), రిషభ్‌ పంత్‌(56) అర్ధ సెంచరీలతో రాణించి ఆదుకున్నారు. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, కౌల్టర్‌నైల్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 68 పరుగులతో రాణించగా, సూర్యకుమార్‌ (19), ఇషాన్‌ కిషన్ ‌(33), డికాక్ ‌(20) పరుగులతో రాణించడంతో ముంబయి జట్టు అలవోకగా ఫైనల్ లో నెగ్గి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నార్ట్జే 2 వికెట్స్ పడగొట్టగా, రబడా, స్టోయినిస్ చెరో వికెట్ తీశారు.

ఐపీఎల్ 2020 వివరాలు:

  • టైటిల్ విజేత: ముంబయి ఇండియన్స్
  • ఫెయిర్‌ప్లే అవార్డు: ముంబయి ఇండియన్స్
  • ఆరెంజ్‌ క్యాప్‌: కేఎల్‌ రాహుల్-670 పరుగులు
  • పర్పుల్ క్యాప్: కగిసో రబాడ-30 వికెట్లు
  • ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్ 2020‌: దేవదత్ పడిక్కల్‌-473 పరుగులు
  • సూపర్ స్ట్రైకర్: కీరన్ పొలార్డ్‌ -191.42 స్ట్రైక్‌రేట్‌
  • మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: జోఫ్రా ఆర్చర్
  • గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్: కెఎల్ రాహుల్
  • ఫైనల్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ : ట్రెంట్ బౌల్ట్

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ