ఐటీఆర్ ఫైల్ చేయడం అవలేదని బాధపడుతున్నారా? ఏం పర్వాలేదు డిసెంబర్ వరకు చేసుకోవచ్చు

The Last Date To ITR Filing For The Financial Year Of 2022-23 31St December,The Last Date To ITR Filing,ITR Filing For The Financial Year,ITR Filing Of 2022-23 31St December,ITR Filing Last Date,Mango News,Mango News Telugu,Net Taxable Income,Income Tax Laws, Income Tax Laws Are Exempt,Exception, To Claim Exemption, Tax Policy, New Tax System, Old Tax System,Filing ITR FY 2022-23,E-Filing Income Tax Return,ITR Filing Latest News,ITR Filing Latest Updates,ITR Filing Live News,Last Date To ITR Filing News Today,Last Date To ITR Filing Latest News

వ్యక్తిగత ట్యాక్స్ పేయర్స్ తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఇచ్చిన చివరి తేదీ జులై 31తో ముగిసిపోయింది. అయినా కూడా ప్రజలు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దీని కోసం ట్యాక్స్ పేయర్స్ కూడా ఒక ప్రక్రియను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇంకా పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయాలను ఇంకా సబ్మిట్ చేయలేనట్లయితే ఇప్పుడు లేట్ ఫీజు చెల్లించడం వల్ల.. తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే ఇక్కడ దీనికి కూడా ఒక నిర్దిష్ట తేదీ ఉందన్న విషయం గుర్తించుకోవాలి.

జులై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయడంలో.. విఫలమైన ట్యాక్స్ పేయర్స్ కూడా ఇప్పుడు ఎంచక్కా తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. ఈ ట్యాక్స్ పేయర్స్.. తమ రిటర్నులను 31 డిసెంబర్ 2023 లోపు సబ్మిట్ చేసుకోవచ్చు. అటువంటి దాఖలుపై.. నెట్ ట్యాక్స్‌బుల్ ఇన్కమ్ పరిధిలోకి వచ్చే ఆదాయం సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు రూ. 5000 వరకు లేట్ ఫైన్ విధించబడుతుంది. ఇది కాకుండా రూ. 5 లక్షల కంటే తక్కువ జీతం ఉన్నవాళ్లు.. రూ. 1000 జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ట్యాక్స్ విధించదగిన ఇన్కమ్ ఏడాదికి.. 5 లక్షల కంటే తక్కువ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు మినహాయింపును అనుమతిస్తాయి. అయితే, సంబంధిత సెక్షన్ల కింద ఈ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి ట్యాక్స్ పేయర్స్.. తమ ఐటీఆర్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఫైన్ లేకుండా ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ అయిన జులై 31 ముగిసిపోవడంతో.. నెట్ ట్యాక్స్ బుల్ ఇన్కమ్ రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే, ఒక వ్యక్తి రూ. 1,000 జరిమానాతో డిసెంబర్ వరకు ఐటీఆర్‌ని ఫైల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు, మీరు లేట్ ఫీ తో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేసినప్పుడు.. మీరు ఏ ట్యాక్స్ పాలసీని ఎంచుకోవాలో గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం, కొత్తట్యాక్స్ సిస్టమ్, ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం.. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను వివిధ ట్యాక్స్ శ్లాబ్‌ల క్రింద దాఖలు చేస్తున్నారన్న విషయాన్ని మరిచిపోకూడదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =