రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు రన్యా రావు సవతి తండ్రి రామచంద్రారావుకు డీఆర్ఐ సమన్లు జారీ చేయగా.. మరోవైపు నవంబర్‌లో తమ పెళ్లి జరిగినట్లు చెప్పిన రన్యా భర్త జతిన్.. డిసెంబర్ నుంచి వేరుగా ఉంటున్నామని కోర్టుకు చెప్పడం హాట్ టాపిక్ అయింది. అలాగే ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ.. రన్యా రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది.
బెంగళూరు బంగరాం స్మగ్లింగ్ కేసులో కన్నడ నిటి రన్యా రావుకు రోజురోజుకు ఉచ్చు బిగుస్తోంది. రన్యా రావు తన బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను బెంగళూరు కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.కాగా ఈ సమయంలో రన్యా రావుతో పెళ్లి విషయంపై ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టుకు చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రన్యాతో తనకు గత నవంబరులో పెళ్లి జరిగినా కూడా కొన్ని పర్సనల్ కారణాలతో డిసెంబర్ నుంచే తాము విడిగా ఉంటున్నామని జతిన్ చెప్పాడు. అయితే ఇంకా తాము అధికారికంగా విడిపోలేదని, కొన్ని కారణాల వల్లే తామిద్దరం వేరువేరుగా ఉంటున్నామని చెప్పారు.
మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా బయటకు వస్తున్న ఒక్కో విషయం ఒక్కో సంచలనంగా మారుతోంది. రన్యారావు బెంగళూరు మాత్రమే కాకుండా గోవా , ముంబై నుంచి కూడా దుబాయ్‌కు వెళ్లినట్టు డీఆర్ఐఅ అధికారులు వెల్లడించారు. హవాలా మార్గంలో వచ్చిన డబ్బులతో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని అధికారులు అనుమానిస్తున్నారు. 45 సార్లు దుబాయ్‌కు ఉదయం వెళ్లిన రన్యా..తిరిగి సాయంత్రానికే రిటర్న్ అయినట్లు విచారణలో తేలింది.
కాగా హీరోయిన్ రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. రన్యా తన బాడీలోని అన్ని భాగాల్లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేసిందని ఆరోపించిన బసన్న గౌడ పాటిల్..మంత్రులకు ఈ కేసుతో సంబంధం ఉందని బాంబు పేల్చారు. సెక్యూరిటీని కూడా దుర్వినియోగం చేశారని.. అయితే కేంద్రం ఎవరిని కాపాడే ప్రయత్నం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో కస్టమ్స్ అధికారుల ప్రమేయం కనుక ఉంటే కచ్చితంగా వాళ్లపై కూడా చర్యలు ఉంటాయని బసన్నగౌడ పాటిల్ అన్నారు.
ఇక ఇటు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యా రావు భర్త జతిన్ హుక్కేరిపై మార్చి 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్నాటక హైకోర్టు ఆదేశించింది. దీంతో జతిన్‌కు వ్యతిరేంగా పిటిషన్ వేస్తామని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. 2024 నవంబర్‌లో బెంగళూరులోని హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్‌లో రన్యారావు, జతిన్ హుక్కేరి వివాహం జరిగింది.అయితే ఆ ఒక్క నెలే ఇద్దరం కలిసి ఉన్నామని..డిసెంబర్ నుంచే తాము విడివిడిగా ఉంటున్నామని జతిన్ చెబుతున్నాడు.