33 మంది కేబినెట్ సభ్యులతో ఆఫ్ఘాన్ లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు

Afghanistan crisis live updates, Mango News, Mullah Hasan named Prime Minister, New Government in Afghanistan, New Government in Afghanistan with 33 Acting Cabinet Ministers, Taliban announce 33-man caretaker cabinet, Taliban Announce New Cabinet For Afghanistan, Taliban announce new interim govt in Afghanistan, Taliban announces new Afghanistan govt, Taliban Announces New Government in Afghanistan, Taliban Announces New Government in Afghanistan with 33 Acting Cabinet Ministers, Taliban name new Afghan government, Taliban’s Akhund to be acting PM

ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని ఇటీవలే తాలిబన్లు పూర్తిగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘాన్ లో అమెరికా బలగాల పూర్తి ఉపసంహరణ, పంజ్‌షేర్‌ స్వాధీన పోరు తదితర కీలక పరిణామాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేశారు. ఈ ప్రభుత్వంలో ముల్లా మహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ ను ప్రధానమంత్రిగా నియమించారు. అలాగే ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ ను డిప్యూటీ ప్రధానిగా ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రిగా ముల్లా యాకూబ్‌, విదేశాంగ మంత్రిగా ముల్లా ఆమీర్‌ ఖాన్‌ ముత్తకీ, విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా అబ్బాస్‌ స్థానిక్‌జాయ్‌, ఇంటీరియర్‌ మంత్రిగా సారాజుద్దీన్ హక్కానీ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా అబ్దుల్ బాకీ హక్కానీ, సైన్యాధ్యక్షుడుగా కారీ ఫసీహుద్దీన్‌ బదక్షానీని నియమించారు. మొత్తం 33 మంది సభ్యులతో తాలిబన్లు తాత్కాలిక కేబినెట్‌ ను ప్రకటించారు. ఆఫ్ఘానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న దాదాపు 20 రోజుల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు ప్రకటన చేశారు. ఆఫ్ఘాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుపై అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =