అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ సీఈవో పదవి నుంచి ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో వైదొలగనున్నట్లు జెఫ్ బెజోస్ ప్రకటించారు. 27 సంవత్సరాలుగా సీఈఓ ఉన్న ఆయన ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని చేపట్టనున్నారు. ఇక జెఫ్ బెజోస్ స్థానంలో సీఈవోగా అమెజాన్ క్లౌడ్-కంప్యూటింగ్ ను నిర్వహిస్తున్న ఆండీ జాస్సీ నియామకం కానున్నారు.
ఈ సందర్భంగా జెఫ్ బెజోస్ అమెజాన్ ఉద్యోగులకు లేఖ రాశారు. ఇకపై అమెజాన్ అభివృద్ధి చేస్తున్న కొత్త ఉత్పత్తులు మరియు ప్రారంభ కార్యక్రమాలపై దృష్టి పెట్టనుననట్టు తెలిపారు. బెజోస్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేష్ షిప్, అమెజాన్ డే 1 ఫండ్ వంటి ప్రాజెక్టులపై ఎక్కువ సమయం గడపబోతున్నట్టు చెప్పారు. అమెజాన్ సీఈవోగా తప్పుకోవడం ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ఇక 1995 లో అమెజాన్ సంస్థను ప్రారంభించి వేగవంతంగా అభివృద్ధి చెందడంలో జెఫ్ కీలక పాత్ర పోషించాడు. ఎన్నో ఘనతలు సాధించి జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ