డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభం, 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహణ: మంత్రి హరీశ్

Diagnostic Hub in Siddipet, Diagnostic Hub in Siddipet Govt Hospital, Finance Minister Harish Rao, Harish Rao, Mango News, Minister Harish Rao, Siddipet, Siddipet Diagnostic Hub, Siddipet gets hi-tech diagnostic center, Siddipet gets hi-tech diagnostic hub, Siddipet Govt Hospital, Siddipet News, Telangana Minister Harish Rao

సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సకల సదుపాయాలతో ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రోగుల సహాయకుల విశ్రాంతి గదిని ప్రారంభించి, పేషేంట్స్ సహాయకుల, పేషేంట్స్ వేచి ఉండేందుకు ఏర్పాటు చేసిన షెడ్డును మంత్రి పరిశీలించారు.

57 రకాల పరీక్షలు పేదవారికి ఉచితంగా నిర్వహణ:

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, హైదరాబాదు బయట జిల్లాలో తొలి డయగోస్టిక్ సెంటర్ సిద్దిపేటలోనే ఏర్పాటు అయిందని చెప్పారు. “ఈ డయాగ్నోస్టిక్ కేంద్రంలో 57 రకాల ఉచిత పరీక్షలు పేదవారికి ఉచితంగా నిర్వహిస్తారు. పేదవారు పరీక్షల మీద వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పేద, మధ్యతరగతి ప్రజలు వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని, ఇక ఆ బాధలను ప్రజల నుంచి తప్పించాలని తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. రూ.2.50 కోట్ల రూపాయలతో తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నాం. 15 రోజులుగా 14 వేల 100 మందికి పరీక్షలు ట్రయల్ రన్ చేశామని, వాటి ఖర్చు రూ.30 లక్షల విలువ కలిగిన పరీక్షలు ప్రజలకు ఉచితంగా అందించాం. గత ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం పెరిగింది. గతంలో వైద్య పరీక్షలకు హైదరాబాదుకు వెళ్లేవారు. ఇది సిద్దిపేటలోనే డయాగ్నోస్టిక్ కేంద్రం రావడం సిద్ధిపేట ప్రజలకు ఒక వరం” మంత్రి పేర్కొన్నారు.

“వైద్య పరీక్ష ఫలితాలను మొబైల్ ఫోన్ కు సందేశం పంపిస్తారు. పైసా ఖర్చు లేకుండా మరో ఆరు నెలలో కూడా అల్ట్రా సౌండ్,ఈసీజీ, ఏక్స్రే అందుబాటులోకి తెస్తాం. రూ.2 కోట్ల వ్యయంతో సిటీ స్కాన్ ను మరో వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో తేనున్నాం. వైద్యం రంగంలో రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడ్డాక ఆకాశానికి, భూమికి ఉన్నా తేడా ఉంది. దేశంలోనే తెలంగాణలో ఇన్సిట్యూషనల్ డెలివరీలు తగ్గించడంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నెంబర్ వన్. ఒక్క గంటలో 1600 పరీక్షలు, రోజుకు 35 వేల పరీక్షలు చేసే సామర్థ్యం సిద్ధిపేట డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రానికి ఉంది. ప్రజలంతా తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seven =