దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, కీలక నటీనటులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, రాజకీయ నేత శరత్ కుమార్ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన భార్య రాధికా శరత్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ఈ రోజు హైదరాబాద్ లో కరోనా పరీక్షలు చేయించుకోగా శరత్ కుమార్ కు పాజిటివ్ గా తేలింది. అయితే ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ఆయనను చాలా మంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు శరత్ కుమార్ ఆరోగ్యం గురించి నేను మీకు తెలియజేస్తాను” అని రాధికా ట్వీట్ చేశారు.
Today Sarath tested positive for Coronavirus in Hyderabad. He’s asymptomatic and in the hands of extremely good doctors! I will keep you updated about his health in the days to come. @realsarathkumar @rayane_mithun @imAmithun_264 @varusarath5
— Radikaa Sarathkumar (@realradikaa) December 8, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ