ఆస్ట్రేలియా vs భారత్: మూడో టీ20లో గెలిచి క్లీన్‌స్వీప్ తప్పించుకున్న ఆస్ట్రేలియా

India vs Australia 3rd T20I : Australia Won By 12 Runs,India vs Australia,India vs Australia 3rd T20I,Mango News,India vs Australia 3rd T20I Highlights,India vs Australia,India vs Australia Highlights,India vs Australia 2020,3rd T20I India vs Australia 2020 Highlights,Ind vs Aus,India vs Australia 3rd T20I Report,Australia,India,Mango News Telugu,India vs Australia 3rd T20 Highlights,Australia Beat India By 12 Runs,IND vs AUS,Australia,India,India vs Australia 2020 Highlights,Australia vs India Match Preview

భారత్-ఆస్ట్రేలియా‌ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలిరెండు టీ20 లు గెలిచి సిరీస్ దక్కించుకున్న భారత్ జట్టు మూడో టీ20లో చివరిదాకా పోరాడి ఓడిపోయింది. సిడ్నీ వేదికగా మంగళవారం నాడు భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు క్లీన్‌స్వీప్ తప్పించుకుంది. ముందుగా టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్సమెన్లలో ఓపెనర్‌ వేడ్ (80), మాక్స్ వెల్(54) స్టీవ్ స్మిత్ (24) పరుగులతో రాణించారు. వేడ్, మాక్స్ వెల్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని పరుగులు సాధించారు. ఈ సిరీస్ లో రెండో హాఫ్‌ సెంచరీతో వేడ్ చెలరేగడంతో ఆసీస్ భారత్ ముందు 187 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్ 1, నటరాజన్ ఒక వికెట్ తీశారు.

మరోవైపు 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. భారత్ జట్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (85) పరుగులతో ఒంటరి పోరాటం చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (0), ఓపెనర్ శిఖర్ ధావన్ (28 ) పరుగులకే వెనుదిరగగా, విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం హార్దిక్ పాండ్యా (20) కూడా సహకారం అందించడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గుచూపింది. అయితే కోహ్లీ, పాండ్యా వెంటవెంటనే అవుట్ అవ్వడంతో మ్యాచ్ భారత్ చేజారింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్‌ స్వేప్సన్ 3 వికెట్లు, మ్యాక్స్‌వెల్‌, అండ్రూ టై, జంపా, అబాట్‌ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక స్వేప్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, హార్దిక్ పాండ్యా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 13 =