కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం: మంత్రి కేటీఆర్

Minister KTR Tweets On New Agricultural Acts,New Agricultural Laws,KTR,Agricultural Laws,Latest Agricultural Laws,Mango News,Mango News Telugu,Minister KTR Tweet,Minister KTR Tweets on New Agricultural Acts,Minister KTR On New Agricultural Acts,Minister KTR Latest Tweet,Minister KTR Tweets On New Agricultural Laws,TRS Party Working President And Minister KTR,#FarmersProtest,#BharatBandh,Farmers Protest,Bharat Bandh,Bharat Bandh Live Updates,Bharat Bandh Updates,Farmers Protest Latest Updates,Farmers Protest News,TRS Party Working President KTR Tweets On New Agricultural Acts

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని, వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అందువలనే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ మేరకు నూతన చట్టాలపై మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు ట్విట్టర్ లో పలు విషయాలను వెల్లడించారు.

“నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరం. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించకపోతే ప్రైవేటు వ్యక్తులు సిండికేట్‌గా మారి రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసే అవకాశం ఉన్నది. దేశంలోని 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. కేంద్రం చెప్తున్నట్టు వీరు వేరే రాష్ట్రాలకు వెళ్లి అమ్మే పరిస్థితి లేదు. ఒక రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు ఎక్కువ ధర ఉంటే మిగతా రాష్ట్రాల వాళ్లు పోటెత్తితే స్థానిక రైతులకు నష్టం కలుగుతుంది” అని మంత్రి కేటీఆర్ అన్నారు

“కార్పొరేట్ సంస్థలు కాంట్రాక్టు వ్యవసాయం చేసుకోవడానికి నూతన చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఈ కాంట్రాక్టు ఒప్పందాలు బలమైన కార్పొరేట్లకు వరంగా మారి, రైతుకు ఉన్న హక్కులు హరించివేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది. నూతన వ్యవసాయ చట్టం ద్వారా బ్లాక్‌ మార్కెట్‌ను నిరోధించడానికి ఏర్పాటు చేసిన నిత్యావసరాల నిల్వల చట్టాన్ని సవరించారు. వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముకునే ప్రమాదం ఉంది. ఇది రైతులకు, వినియోగదారుడికి ఇద్దరికీ నష్టమే. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం నేడు అన్ని రాష్ట్రాల రైతులు కదులుతున్నారు. గత ఆరేళ్లుగా రైతు బంధుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రైతన్నల దేశవ్యాప్త ఆందోళనకు పూర్తి మద్ధతు పలుకుతోంది” అని మంత్రి కేటీఆర్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − nine =