బ్రిటన్‌లో గత 14 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. కానీ ఈసారి బ్రిటన్‌లో అధికారం బదిలీ కావడం ఖాయమని కొద్దిరోజులుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రముఖ సర్వే సంస్థలు కూడ అదే విషయాన్ని స్పష్టం చేశాయి. కన్జర్వేటివ్ పార్టీ ఓడడం ఖాయమని వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా అదే తేలింది. చివరికి అదే నిజమయింది. బ్రిటన్‌లో అధికారం బదిలీ అయింది. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలయింది. 14 ఏళ్ల తర్వాత గద్దె దిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా అధికారం కోసం పరితపిస్తున్న లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. బ్రిటన్‌లో అధికారంలోకి వచ్చింది..
ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో గురువారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు మొదలయిన పోలింగ్ రాత్రి 1 గంటల వరకు కొనసాగింది. ఈసారి రెండు ప్రధాన పార్టీలు కన్జర్వేటివ్, లేబర్ పార్టీలతో పాటు డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ, ఎస్‌డీల్‌పీ,షిన్‌ఫీన్, వర్కర్స్ పార్టీ, యాంటీ ఇమ్మిగ్రేషనన్ రిఫార్మ్ పార్టీ, స్కాటిష్ నేషన్ పార్టీలో బరిలోకి దిగాయి. బ్రిటన్‌లో అధికారంలోకి రావాలంటే 326 స్థానాలను దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడయినట్లుగానే.. లేబర్ పార్టీ 400లకు పైగా స్థానాలను దక్కించుకునేలా కనిపిస్తోంది. అదే సమయంలో కన్జర్వేటివ్ పార్టీ 80 స్థానాల వద్దే ఉంది.
ఈక్రమంలో కన్జర్వేటివ్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. తన సొంత నియోజకవర్గం అయిన రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్‌లో మాట్లాడుతూ.. ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు వెల్లడించారు. మద్ధతు ధారులు తనను క్షమించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపొందిన లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేశారు. బ్రిటన్‌లో అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని.. ఇది దేశ భవిష్యత్తుక, స్థిరత్వపై అందరికీ విశ్వాసాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇకపోతే రెండేళ్ల క్రితమే బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన వారు ఎవరు కూడా బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టలేదు. ఆ పదవి దక్కించుకున్న తొలి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్రకెక్కాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY