బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 291 మందితో టీఎంసీ జాబితా, నందిగ్రామ్ నుండి దీదీ పోటీ

CM Mamata Banerjee will Contest From Nandigram, Mamata Banerjee, Mamata Banerjee to contest polls from Nandigram, Mamata Banerjee to contest WB Assembly polls, Mamata Banerjee’s TMC releases list of 291 candidates, Mango News, TMC Announces 291Candidates List, TMC Candidates List, TMC full list of candidates, TMC Releases Full List of 291 Candidates, WB Assembly polls, West Bengal Elections, West Bengal Elections 2021, West Bengal elections TMC full candidate list, West Bengal Polls

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 291 స్థానాలకు గానూ పార్టీ అభ్యర్థులను టీఎంసీ అధినేత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం నాడు ప్రకటించారు. ఇక ఈ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మార్చి 9 న నందిగ్రామ్ వెళ్తానని, మార్చి 10 న హల్దియాలో నామినేషన్ దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు. ముందుగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ మరియు నందిగ్రామ్ లలో రెండు చోట్ల మమతా బెనర్జీ పోటీచేయనున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ, చివరికి ఆమె నందిగ్రామ్ వైపే మొగ్గుచూపారు. భవానీపూర్ స్థానంలో మమతా బెనర్జీకి బదులుగా టీఎంసీ నాయకుడు సోవన్ ఛటర్జీ పోటీ చేయనున్నారు.

291 మంది టీఎంసీ అభ్యర్థులు బరిలోకి దిగుతుండగా, మూడు చోట్ల మిత్రపక్షాలకు సీట్లను కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికలకు టీఎంసీ ప్రకటించిన జాబితాలో 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అలాగే 79 మంది ఎస్సీ, 17 మంది ఎస్టీ, 42 మంది ముస్లిం అభ్యర్థులు, 27 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. మరోవైపు బెంగాల్లో ఫేజ్-1 పోలింగ్ మార్చి 27 న, ఫేజ్-2 ఏప్రిల్ 1, ఫేజ్-3 ఏప్రిల్ 6, ఫేజ్-4 ఏప్రిల్ 10, ఫేజ్-5 ఏప్రిల్ 17, ఫేజ్-6 ఏప్రిల్ 22, ఫేజ్-7 ఏప్రిల్ 27, ఫేజ్-8 పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. మే 2 వ తేదీన ఓట్లలెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 20 =