భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎల్‌ఐసి) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) ఈ ఉదయం ప్రారంభించబడింది. అయితే ప్రారంభమైన కేవలం రెండు గంటల్లోనే 28% సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఎల్‌ఐసి ఐపిఓ మొత్తం విలువ ₹21,000 కోట్లుగా నిర్ణయించింది. దీంతో ఇది ఇప్పటి వరకు భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా మారింది. కేంద్రం ఎల్‌ఐసి ఐపిఓ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కి ₹902 నుండి ₹949గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పబ్లిక్ ఇష్యూ పెట్టుబడిదారుల కోసం ప్రారంభించబడింది. ఇది మే 9 వరకు సాధారణ ప్రజలకు వేలం వేయడానికి తెరిచి ఉంటుంది. ఉద్యోగుల కోసం దాదాపు 15.81 లక్షల షేర్లు, పాలసీదారుల కోసం దాదాపు 2.21 కోట్ల షేర్లు రిజర్వ్ చేయబడ్డాయి.
ఒక ఎల్‌ఐసి ఐపిఓ లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. ఒక దరఖాస్తుదారు కనీసం ఒకటి మరియు గరిష్టంగా 14 లాట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు లాట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనినిబట్టి ఎల్‌ఐసి ఐపిఓ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన కనీస మొత్తం ₹14,235 (అంటే ₹949 x 15). కాగా పబ్లిక్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకునే పాలసీదారులకు ₹60 తగ్గింపు మరియు ఎల్‌ఐసి ఉద్యోగులకు ₹45 తగ్గింపును ప్రభుత్వం ప్రకటించింది. మొదట ఈ ఐపిఓ మార్చి 31 లోపు ప్రారంభించాలని భావించారు కానీ, అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య పేలవమైన మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇది వాయిదా పడింది. అయితే ఎల్‌ఐసీ షేర్లు మే 17న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకు సహకారం అందించడమే ఈ మెగా ఐపిఓ లక్ష్యం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ