ఒకప్పుడు బాలీవుడ్ గ్లామర్ తారగా వెలుగొందిన మమతా కులకర్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి మలుపు తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఆమె సన్యాసం స్వీకరించింది. కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో మమతా సన్యాసం స్వీకరించి, తన పేరును ‘శ్రీ యామై మమతా నందగిరి’గా మార్చుకుంది. ఈ నిర్ణయం నేటి బాలీవుడ్ మరియు ఆధ్యాత్మిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మమతా కులకర్ణి బాలీవుడ్‌లో కరణ్ అర్జున్, సబ్ సే బడా ఖిలాడీ, క్రాంతివీర్ వంటి హిట్ చిత్రాల్లో నటించి, 1990లలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ వంటి చిత్రాలతో తన ప్రతిభను చాటుకుంది. అయితే 2002 తర్వాత సినిమాలకు దూరమైంది. ఆమె విక్కీ గోస్వామి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నప్పటికీ, అతను డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఆ సంబంధం ముగిసినట్టు వార్తలొచ్చాయి.
తాజాగా, కుంభమేళాలో రుద్రాక్ష మాలలు, కాషాయ వస్త్రాలు ధరించి, గంగానదిలో మమత మూడు సార్లు మునక వేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి ఆమెను కిన్నెర అఖాడా మహా మండలేశ్వర్‌గా నియమించినట్లు ప్రకటించారు.
2015లో స్థాపించబడిన కిన్నెర అఖాడా, ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పనిచేస్తున్నది. మమతా ఈ అఖాడాతో ఏడాదిన్నర నుంచి సంప్రదింపులు జరుపుతూ, చివరకు ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించింది. ఆమెను మహా మండలేశ్వర్‌గా నియమించడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. కిన్నెర అఖాడా సభ్యులు కోరిన విధంగా ఆమె ఆధ్యాత్మిక పాత్రల్లో నటించవచ్చని స్పష్టత ఇచ్చారు.
మమతా కులకర్ణి తన నిర్ణయం గురించి మాట్లాడుతూ, “మహాదేవుడు, మహాకాళి, నా గురువు ఆశీస్సులతోనే ఈ మార్పు సంభవించింది” అని పేర్కొంది.
మమతా గతంలో ముంబైలో తన గ్లామర్ క్యారీరుతో యువత గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆమె చేసిన టాప్‌లెస్ ఫొటో షూట్ అప్పట్లో సంచలనం సృష్టించగా, 2015లో రూ. 2,000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో ఆమె పేరు తెరపైకి రావడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక మార్గం తీసుకోవడం విశేషంగా నిలిచింది.
View this post on Instagram
View this post on Instagram