సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం, దేశంలో తాజా పరిస్థితులపై చర్చ

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, CAA And JNU Issue Updates, CAA Protest, Citizenship Amendment Act, Citizenship Amendment Act 2019, CWC Meeting Over CAA And JNU Issue, Mango News Telugu

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జనవరి 11, శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరుగుతుంది. అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలోనే ఈ సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, చిదంబరం లతో పాటుగా ఇతర సీడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. జనవరి 13న ఢిల్లీలో ప్రతిపక్షాలతో భేటీ కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ భేటీ అయినట్టుగా తెలుస్తుంది.

దేశంలో కొన్ని ప్రాంతాల్లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, జేఎన్‌యూలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన, విద్యార్థుల నిరసనలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. సోనియా గాంధీ ఇప్పటికే జేఎన్‌యూలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండించి, పార్టీ తరపున నిజనిర్ధారణ చేసేందుకు బృందాన్ని పంపిన సంగతి తెలిసిందే. అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో అ అంశంపై కూడా చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =