టెన్నిస్ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Men's World Number One Tennis Player Novak Djokovic Tests Positive for Covid-19

వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్‌ జకోవిచ్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. “టోర్నమెంట్ అనంతరం బెల్గ్రేడ్ చేరుకున్న వెంటనే కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నాము. నాకు, నా భార్య జెలెనా కు కరోనా పాజిటివ్ గా తేలింది. మా పిల్లలకు నెగెటివ్ వచ్చింది. నాతో పాటుగా టోర్నమెంట్ సందర్భంగా కరోనా సోకినా ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కరోనా పాజిటివ్ రావడంతో 14 రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. అలాగే ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటామని” నొవాక్‌ జకోవిచ్‌ ప్రకటనలో తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu