కరోనాకు పతంజలి ఆయుర్వేద మందు, ‘కొరొనిల్’ కిట్ ధర రూ.545

Baba Ramdev, Baba Ramdev Patanjali, Baba Ramdev’s Patanjali Launches Coronil Kit, Coronil Kit, Coronil Kit For Coronavirus, Coronil Kit to Treat Coronavirus, Patanjali, Patanjali Coronil Kit, Patanjali Coronil Kit For Coronavirus

ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. కాగా ఇటీవలే భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్ కరోనా నియంత్రణకు ‌ఫవిపిరవిర్‌ ఔషధం విడుదలకు అనుమతి సాధించింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ దేశీయ ఆయుర్వేద కంపెనీ పతంజలి కూడా కరోనాకు మందు కనిపెట్టినట్టు పేర్కొంది.

‘కొరోనిల్‌’ పేరుతో ఈ ఆయుర్వేద మందును మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు పతంజలి సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌ ప్రకటించారు. జూన్ 23, మంగళవారం నాడు హారిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో ఈ మందును బాబా రాందేవ్‌ ఆవిష్కరించారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చని, ఈ మందు తీసుకురావడానికి మా శాస్త్రవేత్తలు ఏంతో కృషి చేశారని బాబా రాందేవ్‌ పేర్కొన్నారు. అలాగే కొరొనిల్ కిట్ కేవలం 545 రూపాయలకే లభిస్తుందని పతంజలి వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ చెప్పారు. కరోనా కిట్‌లో 30 రోజులకు సరిపడే మందులు ఉంటాయని చెప్పారు. ‘కొరోనిల్’ మందు ద్వారా 5 నుంచి 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ ప్రకటించింది. కాగా కొరొనిల్ కు సంబంధించిన పూర్తి పరిశోధనా వివరాలు, మోతాదు అంశాలు, ఈ మందు ప్రయోగ, అనుమతుల వివరాలు, అందజేయాలని పతంజలికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు ఈ నివారణ మందు ప్రకటనలను నిలిపివేయాలని ఆయుష్ శాఖ సూచించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 5 =