మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నతొలి పూర్తిస్థాయి బడ్జెట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జులై 23న బడ్జెట్‌ను సమర్పించడానికి నిర్ణయించింది కేంద్రం. నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఈవీ రంగం, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగం, మౌలిక సదుపాయాలపై కేంద్రం ఎక్కువ దృష్టి పెట్టొచ్చన్న అంచనాలున్నాయి. అయితే, బడ్జెట్ రోజు మాత్రమే దీనిపై సవివరంగా సమాచారం అందుబాటులో ఉంటుందన్న విషయం తెలిసిందే.ఈ సమావేశాల్లోనే కేంద్రం ఆరు బిల్లులను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటు నీట్ పేపర్ లీకేజ్, రైల్వే భద్రత అంశాలపై నిలదీయాలని భావిస్తున్న విపక్షం..ఉప సభాపతి పదవి కోసం పట్టు పట్టబోతున్నట్లు సమాచారం.
మరోవైపు ఇప్పటి వరకూ బడ్జెట్‌ను ఎక్కువ సార్లు సమర్పించిన మంత్రి ఎవరన్న చర్చ తెరమీదకు వచ్చింది. మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ తో పాటు ఇప్పటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరు సార్లు బడ్జెట్‌ను సమర్పించారు. అయితే ఈసారి కూడా నిర్మలమ్మమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో వరుసగా 7 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డులకెక్కనున్నారు. ఇంధిరా గాంధీ తర్వాత నిర్మలా సీతారామన్ రెండో మహిళా ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2019లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం.. సీతారామన్‌కు ఆర్థికశాఖ బాధ్యతల్ని అప్పగించింది.
మొత్తంగా భారతదేశ చరిత్రలో మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు దేశ బడ్జెట్‌ను సమర్పించారు. అయితే దీనిలో భారత దేశం పూర్తి బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ రెండూ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మొరార్జీ దేశాయ్ తన పుట్టిన రోజైన ఫిబ్రవరి 29న ఒకసారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఉంది. చరిత్రలో మరే ఆర్థిక మంత్రికి ఇలాంటి అవకాశం రాలేదు. అలాగే ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రుల జాబితాలో అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE