44 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం

Another 44 crore Covid vaccines ordered, Centre places fresh orders for 44 crore doses of Covishield, Covid round-up: Centre orders 44 crore vaccine doses, COVID-19, Govt of India Placed Fresh Order for 44 Crores Covid Vaccine Doses, Govt places fresh order for 44 crore vaccines, Govt places orders for 44 crore doses of Covishield & Covaxin, India Order for 44 Crores Covid Vaccine Doses, Mango News, Modi govt places orders for 44 crore doses of Covishield, Order for 44 Crores Covid Vaccine Doses

దేశంలో జూన్ 21 తేదీ నుంచి 18 సంవత్సరాలు పైబడినవారందరికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందజేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 43 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆర్డర్ పెట్టింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో 25 కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం, అలాగే భారత్ బయోటెక్ తో 19 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ కోసం ఆర్డర్ ఇచ్చింది. మొత్తం ఈ 44 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు డిసెంబర్ 2021 వరకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు భారత్ బయోటెక్ నుంచి కరోనా వ్యాక్సిన్ల సేకరణకు అదనంగా 30 శాతం అడ్వాన్సు విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here