చారిత్రక కార్మిక సంస్కరణ: 4 కొత్త లేబర్ కోడ్‌లకు కేంద్రం శ్రీకారం

Modi Govt Launches Four New Labour Codes, Replacing 29 Old Laws From Today

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించి కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 29 వేర్వేరు కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన నాలుగు కార్మిక స్మృతులను (Labour Codes) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు కొత్త లేబర్ కోడ్స్ నేటినుండి అమలులోకి వస్తున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖల మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. కాగా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోనే అతిపెద్ద కార్మిక సంస్కరణలు ఇవే కావడం గమనార్హం.

సంస్కరణ లక్ష్యం
  • లక్ష్యం:ఆత్మనిర్భర్ భారత్‘ లక్ష్య సాధనలో భాగంగా, మారుతున్న పనితీరు, పరిస్థితులకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సంసిద్ధం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌‌సుఖ్ మాండవీయ తెలిపారు.

  • ప్రయోజనం: ఈ చారిత్రక నిర్ణయంతో కార్మిక నిబంధనలు, కార్మికుల సంక్షేమం మెరుగుపడుతుందని ఆయన అన్నారు.

  • పాత చట్టాలు: మన దేశంలోని చాలా కార్మిక చట్టాలు 1930ల నుంచి 1950ల మధ్య కాలంలో రూపొందించబడ్డాయని, ఆ నాటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారాయని మంత్రి పేర్కొన్నారు. కాలం చెల్లిన నిబంధనల సమస్య ఈ సంస్కరణలతో తొలగిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

  • అమలు ఆలస్యం: కొత్త లేబర్‌ కోడ్‌లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించింది. కానీ, వివిధ రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేయడంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది.

అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్

29 పాత చట్టాల స్థానంలో అమలులోకి వచ్చిన నాలుగు కొత్త కార్మిక స్మృతులు ఇవి:

  1. వేతనాలకు సంబంధించిన కోడ్ 2019 (Code on Wages, 2019): జీతాలు మరియు వేతనాల చెల్లింపులకు సంబంధించినది.

  2. శ్రామిక యూనియన్‌లు, ఉద్యోగ వివాదాల నియమాల కోడ్ 2020 (Industrial Relations Code, 2020): ఉద్యోగ వివాదాలు మరియు కార్మిక సంఘాల నిర్వహణకు సంబంధించినది.

  3. సాంఘిక భద్రతా ప్రయోజనాల కోడ్ 2020 (Code on Social Security, 2020): ఇన్స్యూరెన్స్, పీఎఫ్ (PF), వైద్యం వంటి సామాజిక భద్రత ప్రయోజనాలను కవర్ చేస్తుంది.

  4. పని స్థలంలో భద్రత, ఆరోగ్యం, పని షరతుల నియంత్రణ కోడ్ 2020 (Occupational Safety, Health & Working Conditions (OSHWC) Code, 2020): పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితులను నియంత్రిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here