కేరళలోని వయనాడ్ జిల్లా ముండక్కై, చురల్‌మల ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటంతో..భారీగా ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగింది. సుమారు 500మంది పైగా మృత్యు వాత పడ్డారు. గ్రామాలకు గ్రామాలు మట్టిలో కలిసిపోయాయి. ఇలాంటి దుర్ఘటన జరిగిన ప్రాంతంలో గల్లంతైన వారి కోసం ఇంకా కూడా సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే కేరళలోని వయనాడ్ ప్రాంతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 10న సందర్శించనున్నారు.కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లోని విపత్తు ప్రాంతాన్ని మోదీ సందర్శిస్తారు. ముందుగా కన్నూర్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని..ఆ తర్వాత హెలికాప్టర్‌లో వయనాడ్ చేరుకుని.. విపత్తు ప్రాంతాన్ని, పునరావాస శిబిరాలను సందర్శిస్తారు.
వయనాడ్ లోని ముండక్కై, చురల్‌మలలో కొండచరియలు విరిగిపడి అధికారికంగా 412 మరణించినట్లు అంచనా 500మందికి పైగా ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.చనిపోయిన వాళ్లతో పాటు మరికొంతమంది ఆచూకి ఇంకా తెలియరాలేదు.మరి కొందరు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వరద బాధితుల్ని పరామర్శించడానికి..విపత్తు ప్రాంతాన్ని పరిశీలించడానికి ప్రధాని మోదీ శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.
కేరళ ప్రభుత్వం వయనాడ్ పునరావాసానికి సంబంధించిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అదే సమయంలో ముండక్కై , చురల్‌మల కొండచరియలు విరిగిపడి 402 మంది మరణించినట్లు చివరి అధికారికంగా నిర్ధారించింది. 154 మంది గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. 88 మంది మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ దొరికన డెడ్ బాడీలకు ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించింది.