ఉద్యోగ పరీక్షలలో అమ్మాయిల ఆధిపత్యం కొనసాగుతోంది. UPSC, PCS వంటి పరీక్షలపై అమ్మాయిల ఆసక్తి పెరుగుతోందని, తాజాగా వచ్చిన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) 2022 ఫలితాలు నిరూపించాయి. ఈ ఫలితాల్లో టాప్-10లో 6 మంది అమ్మాయిలు చోటు సంపాదించడం విశేషం. మొత్తం 394 మంది అభ్యర్థులు ఎంపికవగా, టాప్-10లో ఆరుగు ర్యాంకులు అమ్మాయిలు కొల్లగొట్టారు.
టాపర్‌గా నిలిచిన దీపికా పాటిదార్
MPPSC 2022 పరీక్షలో దీపికా పాటిదార్ అగ్రస్థానంలో నిలిచింది. ఆమె 902.75 మార్కులు సాధించి టాపర్‌గా పేరు తెచ్చుకుంది. దీపికా మధ్యప్రదేశ్‌లోని దేవాస్ నివాసి.
టాప్-10లో వీరే :
సురభి జైన్ – మూడో ర్యాంక్, 893 మార్కులు
మహిమా చౌదరి – నాలుగో ర్యాంక్, 888.50 మార్కులు
షాను చౌదరి – ఆరో ర్యాంక్, 885.50 మార్కులు
స్వాతి సింగ్ – ఏడవ ర్యాంక్, 884.75 మార్కులు
కవితా దేవి యాదవ్ – తొమ్మిదవ ర్యాంక్, 882.75 మార్కులు
టాప్-10లో ఈ ఆరుగురు అమ్మాయిలు డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికయ్యారు.
అబ్బాయిల ప్రతిభ:
MPPSC 2022లో టాప్-10లో కేవలం నలుగురు అబ్బాయిలు నిలిచారు.
ఆదిత్య నారాయణ్ తివారీ – రెండో ర్యాంక్, 897.50 మార్కులు
ధరమ్ ప్రకాష్ మిశ్రా – ఐదవ ర్యాంక్, 885.75 మార్కులు
ఉమేష్ అవస్తీ – ఎనిమిదవ ర్యాంక్, 883.50 మార్కులు
ప్రత్యూష్ శ్రీవాస్తవ – పదవ ర్యాంక్, 878.50 మార్కులు
ఈ అబ్బాయిలు సైతం అహోరాత్రులు కష్టపడి తమ కలల పోస్టులను సాధించారు.
ఈ ఫలితాలు అమ్మాయిల కష్టపడే సామర్థ్యాన్ని, అంకితభావాన్ని, ఉద్యోగ పరీక్షల్లో వారి అభివృద్ధిని స్పష్టంగా చూపుతున్నాయి. విద్యార్థులకు ఇది గొప్ప స్ఫూర్తి కధనంగా నిలుస్తుంది.