ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ జాబితాలో తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకున్నారు. భారతదేశంలోని అత్యంత వందమంది సంపన్నల జాబితాపై ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన లిస్టులో.. టాప్ ప్లేస్‌ను ముకేశ్ అంబానీ నిలుపుకున్నారు. ఈసారి టాప్-100లో చోటు సంపాదించిన సంపన్నులు తొలిసారి నికర విలువలో ట్రిలియన్ డాలర్లు దాటినట్టు ఫోర్బ్స్ పేర్కొంది.
ఈ ఏడాది ముకేశ్ అంబానీ ఏకంగా 27.5 బిలియన్ డాలర్లు సంపాదించి..తన సంపదను 119.5 బిలియన్ డాలర్లకు పెంచారు. ప్రస్తుతం ఆయన నికర విలువ 108.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ 13వ స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-100 ధనవంతుల సామూహిక సంపద ఈ ఏడాది 40 శాతం పెరిగి 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం ఓ మైలురాయి అంటూ ఫోర్బ్స్ పేర్కొంది.
ఇక ఫోర్బ్స్ జాబితా ప్రకటించిన ఇండియాలో 100 మంది ధనవంతుల మొత్తం సంపద 2024 నాటికి తొలిసారి ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. ఇది 40% పెరిగి 1.1 ట్రిలియన్ డార్లకు చేరుకున్నట్లు తెలిపింది. గతేడాది ఈ మొత్తం 799 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పింది. అలాగే ఫోర్బ్స్ ఆసియా అక్టోబర్ సంచికలో ఐపీఓలు, మ్యూచువల్ ఫండ్లలోకి ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరగడంతో.. భారత స్టాక్ మార్కెట్ బుల్ రన్ లో ఉందని పేర్కొంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 30% పెరిగినట్లు పేర్కొంది.
ఫోర్బ్స్ ప్రకటించిన తాజా జాబితాలో 58 మంది తమ సంబంధిత నికర విలువలకు $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ జోడించారు. అంబానీ మరోసారి టాప్ ప్లేస్ ను సొంతం చేసుకోగా..గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. డాలర్ పరంగా అత్యధికంగా లాభపడిన వ్యక్తి. రెండవ స్థానం. తన సోదరుడు వినోద్‌తో కలిసి 48 బిలియన్ డాలర్లను కలుపుకొని తన ఫ్యామిలీ నికర విలువను 116 మిలియన్ డాలర్లకు పెంచుకున్నారు గౌతమ్ అదానీ.
ఇక 43.7 బిలియన్ డాలర్లతో సావిత్రి జిందాల్ మూడో స్థానంలో ఉండగా.. శివ నాడార్ 40.2 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచారు. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు అయిన దిలీప్ షాంఘ్వీ ఈ ఏడాది ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి 19 డాలర్ల నుంచి 32.4 బిలియన్ డాలర్లతో 5వ స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో కొత్తగా నలుగురు చేరగా వారిలో ఇద్దరు ప్రైవేట్‌గా ఉన్నారు బి. పార్థ సారధి రెడ్డి 3.95 బిలియన్ డాలర్లతో 81వ స్థానంలో ఉన్నారు.