దేశంలో కరోనా నిబంధ‌న‌ల అమ‌లు గ‌డువు మార్చి 31 వరకు పొడిగింపు

Centre Covid-19 Guidelines, Centre Covid-19 Guidelines News, COVID-19, COVID-19 Guidelines, COVID-19 Guidelines Extended, Covid-19 Guidelines for Surveillance Containment, Mango News, MHA Covid-19 Guidelines rules, MHA Extends COVID-19 Guidelines, MHA Extends COVID-19 Guidelines For Surveillance, MHA Extends Covid-19 Guidelines for Surveillance Containment, MHA issues new COVID-19 guidelines, New Covid-19 Guidelines

దేశంలో కరోనా మహమ్మారిపై నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాలను మార్చి 31, 2021 వ‌ర‌కు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలు కరోనా నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు మరియు కొత్తగా నమోదయ్యే రోజువారీ కరోనాకేసుల్లో గణనీయమైన క్షీణత ఉన్నప్పటికీ, ఈ మహమ్మారిని పూర్తిగా అధిగమించడం కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త వహించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అలాగే ముందుగా వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికీ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలని సూచించారు. తద్వారానే కరోనా వ్యాప్తిని విచ్ఛిన్నం చేసి, ఈ మహమ్మారిని పూర్తిగా అధిగమించడానికి వీలుంటుందని చెప్పారు. ఇక కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించడం సహా జోన్లలో నిర్దేశించిన నియంత్రణ చర్యలును కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. మరోవైపు దేశంలో అనుమతించబడిన వివిధ కార్యకలాపాలకు సంబంధించి గ‌తంలో సూచించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ (ఎస్ఓపీలు) తప్పనిసరిగా, కఠినంగా అనుసరించాలని చెప్పారు. అందుకు సంబంధించి జనవరి 27, 2021 న జారీ చేసిన మార్గదర్శకాలలో సూచించిన విధంగా, మార్గదర్శకాలు/ఎస్ఓపీలను కఠినంగా పాటించడంపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు దృష్టి కేంద్రీకరించి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని తాజా ఆదేశాల్లో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 19 =