300 బిలియన్ డాలర్లు దాటిన తొలి కుబేరుడుగా మస్క్..

Musk Is The First Billionaire To Cross 300 Billion, First Billionaire To Cross 300 Billion, 300 Billion, Amazon Founder Jeff Bezos, Bernard Arnault And Family, Meta CEO Mark Zuckerberg, Musk Is The First Billionaire To Cross $300 Billion, Oracle CEO Larry Ellison, Tesla Elon Musk, Billionaire, National News, International News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. వ్యక్తిగత నికర సంపద 300 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. గతవారం టెస్లా షేర్లు 30 శాతానికి పైగా పుంజుకోవడంతో..తాజాగా ఎలాన్ మస్క్ సంపద 304 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు అయింది.

దీంతో 300 బిలియన్ డాలర్లకు పైగా సంపద గల తొలి కుబేరుడిగా మస్క్ నిలిచినట్లు ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజే టెస్లా షేర్ 8.19 శాతం పెరిగి 321.22 బిలియన్ డాలర్లకు, ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద 4.71 శాతానికి పెరిగింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు ఎలాన్ మస్క్ గట్టి మద్దతుదారుగా నిలిచారు. పలు ఎన్నికల సభలకు హాజరవడమే కాకుండా ఎన్నికల ఖర్చును భారీగా ఖర్చు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా ప్రచారం చేయడం ఎలాన్ మస్క్‌కు కలిసి వచ్చినట్లు అయింది.

అంతర్జాతీయ బిలియనీర్లలో ఎలాన్ మస్క్ ఇప్పుడు మొదటి స్థానంలో నిలుస్తున్నారు. మస్క్ తర్వాతి స్థానాల్లో ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిసన్.. 230.7 బిలియన్ డాలర్లతో, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్.. 224.5 బిలియన్ డాలర్లుతో, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ..203.8 బిలియన్ డాలర్లతో, బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ..165.5 బిలియన్ డాలర్లతో వరుసగా నిలిచారు.