ఆగస్ట్ 15 వస్తుందంటేనే భారతీయుల హృదయాలు దేశభక్తితో పులకించిపోతాయి. ప్రతీ వీధి, ప్రత గల్లీ కూడా జాతీయ జెండా రెపరెపలతో కళకళలాడుతుంది. దీనిపై స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా చేపడుతుంది.
దీనిలో భాగంగా ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్రం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని పేర్కొంది. అయితే ఇదే సమయంలో స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తుండటం వల్ల హర్‌ఘర్‌తిరంగాను గుర్తిండిపోయే ఈవెంట్‌గా మార్చుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆగస్ట్ 9 నుంచి ఆగస్టు 15 వరకు అందరూ తమతమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్స్‌ను మార్చాలని ప్రధాని మోదీ కోరారు. వాట్సాప్,ఫేస్‌బుక్, ఎక్స్ ప్లాట్ ఫామ్,ఇన్‌స్టాగ్రామ్,టెలిగ్రామ్ వంటి అకౌంట్ల డీపీలను త్రివర్ణ పతాకంతో మార్చుకోవాలని పీఎం పిలుపునిచ్చారు. తాను తన డీపీని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నానని అంతా అలాగే చేయాలని కోరారు. అంతేకాదు జాతీయ జెండాలతో సెల్ఫీలు తీసుకుని https://harghartiranga.comలో షేర్ చేయాలని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.