డెల్టా ప్లస్ వేరియంట్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

Covid Delta Plus Variant Found in 3 States, Covid Third wave in India, COVID-19 Variant Delta Spreads In India, Delta Plus Covid Variant in India, Delta plus variant of coronavirus spreading in India, Delta-plus Covid variant, Delta-variant B.1.617.2, Maharashtra reports 21 cases of Delta-plus Covid variant, Maharashtra reports Delta-plus variant, Mango News, Three States Report Positive Cases, Union Health Ministry Advised over Containment Measures

దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ను 3 రాష్ట్రాల్లో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇన్సాకాగ్ లాబ్స్ లో ఇటీవల వచ్చిన ఫలితాల ఆధారంగా, మహారాష్ట్ర, కేరళ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కనుగొనబడడంతో ఆయా రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. మహారాష్ట్రలోని రత్నగిరి మరియు జల్గావ్ జిల్లాల్లో, కేరళలోని పాలక్కాడ్ మరియు పతనమిట్ట జిల్లాలు, మధ్యప్రదేశ్ లోని భోపాల్ మరియు శివపురి జిల్లాల్లోని జన్యు శ్రేణి నమూనాలలో డెల్టా ప్లస్ వేరియంట్ కనుగొనబడిందని చెప్పారు. ప్రస్తుతం వేరియంట్ ఆఫ్ కన్సర్న్అయిన డెల్టా ప్లస్ వేరియంట్ కు ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉండడం, ఊపిరితిత్తుల కణాల గ్రాహకాలకు బలమైన బంధం ఏర్పరచుకోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీ ప్రతిస్పందనలో సంభావ్య తగ్గింపు వంటి లక్షణాలను కలిగి ఉందని ఇన్సాకాగ్ తెలియజేసింది.

ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలపై మరింత దృష్టి సారించి, ప్రభావవంతంగా అమలుచేయాలని ఈ మూడు రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ప్రజలు గుమిగూడకుండా నివారించడం,పెద్దఎత్తున పరీక్షలు నిర్వహించడం, సరైన ట్రేసింగ్ మరియు వ్యాక్సిన్ కవరేజ్ వంటి వాటితో సహా ఇన్సాకోగ్ గుర్తించిన జిల్లాలు మరియు క్లస్టర్లలో తక్షణమే నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. అలాగే పాజిటివ్ గా నిర్ధారించబడిన వ్యక్తుల యొక్క తగినన్ని నమూనాలను వెంటనే ఇన్సాకాగ్ ఆధ్వర్యంలోని ల్యాబ్స్ పంపించేలా చూడాలని కేంద్రం సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eighteen =