ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ అయోధ్యలో నిర్మించిన రామమందిరం ఒక్క వర్షానికే ప్రభావం చూపించడం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం రోజు కురిసిన భారీ వర్షానికి నీరు లీకేజ్ అయిన వీడియోలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జనవరి 22 ..2024న బీజేపీ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఆలయాన్ని ప్రారంభించింది. అయితే ఆలయ ప్రారంభం అయిన కొన్ని నెలలకే గర్భ గుడిలో ఒక్క వర్షానికే నీళ్లు వచ్చి చేరాయి. అయోధ్య ఆలయాన్ని ప్రారంభించి ఇంకా ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటంతో విపక్షాలతో పాటు సామాన్యుల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
మొదటిసారి వర్షం కురిసినప్పుడే అయోధ్య రామాలయ గర్భాలయంలోకి నీళ్లు వచ్చి చేరాయని ఆలయ ప్రధాన అర్చకుడు అయిన సత్యేంద్ర దాస్ చెప్పారు. ఆలయ పైభాగాన్ని సరిగ్గా నిర్మించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన అర్చకుడు డిమాండ్ చేశారు. అసలే రానున్నది వర్షాకాలం కావడంతో వెంటనే సమస్య పరిష్కరించకపోతే పూజలు చేయడం కష్టమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అయోధ్య రామమందిరం లీకేజీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్.. జనవరిలో ప్రారంభించిన ఆలయ ప్రధాన భవనమే ఇప్పుడు లీకేజీకి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం వల్ల.. అయోధ్య రామాలయంలో లీకేజీ జరిగిందనే వార్తతో వివాదం చెలరేగుతోంది. అయోద్య రామ మందిర నిర్మాణ పటిష్టతపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అయోధ్య ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా ఇదే విషయంపై స్పందించారు. గురు మండపం బహిరంగ ప్రదేశంలో ఉండడమే దీనికి కారణమని అన్నారు. దీనిని రిపేర్ చేయిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. మొదటి అంతస్తులో లీకేజీని గుర్తించామని, మొదటి అంతస్తు నిర్మాణంలో మాత్రమే కొంచెం లోపం ఉందన్న ఆయన… నిర్మాణంలో కానీ, డిజైన్‌లో కానీ ఎలాంటి సమస్యలు లేవని వివరించారు.ఇటు ఈ విషయంలో ప్రతిపక్షపార్టీ అయిన కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయోధ్యను కూడా బీజేపీ అవినీతి కేంద్రంగా మార్చిందని ఆరోపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ