భారత ప్రధాని మోదీని కలిసిన బంగ్లాదేశ్ ప్ర‌ధానమంత్రి షేక్ హ‌సీనా, ఇరు దేశాల మధ్య 7 కీలక ఒప్పందాలు

India and Bangladesh Signs on 7 Key MoUs Including Kushiyara River During Both Prime Ministers Modi-Hasina Talks, PM Modi Meets PM Hasina, India Bangladesh Sign Five MoUs, India Bangladesh Ink 7 MoUs, 7 Key MoUs Including Kushiyara River, Prime Ministers Modi-Hasina Talks, India And Bangladesh Signs 7 MoUs, India And Bangladesh PM Meeting, India PM Narendra Modi, Bangladesh PM Hasina, India Bangladesh To Sign Six Agreements, India , Bangladesh

బంగ్లాదేశ్ ప్ర‌ధానమంత్రి షేక్ హ‌సీనా మంగళవారం నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేశారు. ఈ మేరకు ఆమెకు ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అనంతరం హసీనా భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రధాన మంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను సమీక్షించి, వీటిని మరింత బలోపేతం చేయడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏపీ ఇరువురు ప్రధానులు దీనిపై ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఇక మోదీ-హసీనా చర్చల సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ 7 కీలక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. దీనిలో ప్రధానంగా కుషియారా నది అంశం కూడా ఉండటం విశేషం.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఎగుమతులకు ఆసియాలో అతి పెద్ద మార్కెట్ భారత్ అని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాము త్వరలోనే ద్వైపాక్షిక ఆర్థిక సమగ్ర ఒప్పందంపై చర్చలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకుంటాయని, అలాగే ఉగ్రవాదం సమస్యపై కూడా చర్చించామని తెలిపారు. ఇక భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 54 నదులు ప్రవహిస్తున్నాయని, వీటిలో ముఖ్యమైన కుషియారా నది జల పంపిణీ ఒప్పందంపై తాము సంతకాలు చేశామని వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), అంతరిక్షం, అణు ఇంధన రంగాల్లో కూడా ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.

ఇక బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హ‌సీనా మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నందుకు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భార‌త్ త‌మ‌కు మంచి మిత్ర దేశమని, బంగ్లాదేశ్ విముక్తి పోరాట స‌మ‌యంలో భారత్ అందించిన స‌హాకారాన్ని మ‌రిచిపోలేమ‌ని వ్యాఖ్యానించారు. ద‌క్షిణాసియా ప్ర‌జ‌ల అభ్యున్న‌తికై ఉభయ దేశాలు దోహద ప‌డాల‌ని హ‌సీనా పిలుపునిచ్చారు. తమ చర్చల ఫలితాలు ఇరు దేశాల ప్రజలకు లబ్ధి చేకూర్చుతాయని భావిస్తున్నామని అన్నారు. ఇక భారత పర్యటనలో హసీనా పలువురు కీలక నేతలను కలవనున్నారు. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో కీలక చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ సీనియర్ మంత్రులతో కలిసి ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్‌లను కూడా కలవనున్నారు. అలాగే గురువారం, హసీనా ప్రసిద్ధ మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించడానికి అజ్మీర్ వెళ్లనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =