నూతన సంవత్సరం అనేది కేవలం ఒక కొత్త తేదీ మాత్రమే కాదు; అది గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త ఆశలతో ముందుకు సాగే దశ. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ రోజును తమకు ప్రత్యేకమైన విధాలుగా జరుపుకుంటారు. మన దేశంలో కూడా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి, ముఖ్యంగా యువత ఉత్సాహంగా సెలబ్రేట్ చేశారు.
యువతను ఆకర్షించేందుకు పబ్‌ల యాజమానులు రకరకాల ఈవెంట్స్ నిర్వహించారు. దీనితోపాటు ఓయో రూమ్స్ బుకింగ్‌లకు భారీ డిమాండ్ నెలకొంది. ప్రత్యేకించి యువత ప్రేమికుల కోసం ఓయో రూమ్స్ వారి బెస్ట్ ఛాయిస్‌గా మారాయి. గతంలో ప్రేమికులు పార్కుల్లో గడిపేవారు. కానీ ఇప్పుడు ఎక్కువమంది ఏకాంతం కోసం ఓయో రూమ్స్ ను ఎంచుకుంటున్నారు. ఇది ఓయో రూమ్స్ పట్ల సమాజంలో వివిధ భావనలకు దారితీసింది. నార్మల్ ఫ్యామిలీస్ అయితే ఈ రూమ్స్ పై విమర్శనాత్మక దృష్టితో ఉన్నాయి.
ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా, ఓయో రూమ్స్ కి రికార్డు స్థాయిలో బుకింగ్‌లు జరిగాయి. కంపెనీ ప్రకటన ప్రకారం, 10 లక్షల మందికి పైగా న్యూ ఇయర్ సందర్భంగా రూమ్స్ బుక్ చేసుకున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వంతు సహా నగర యువత ఆకర్షణకు అడ్డగా మారింది.