ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ‘కార్వీ’ గ్రూప్‌కు మరోసారి షాక్ ఇచ్చిన ఈడీ, రూ.110 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్

ED Attaches Assets Worth Rs 110 Crore of Karvy Group in Money Laundering Case, 2800 crore Karvy scam, Karvy Group Money Laundering Case, Money Laundering Case, ED Attaches Assets Worth Rs 110 Crore of Karvy Group, Enforcement Directorate Attaches Assets Worth Rs 110 Crore of Karvy Group, money laundering case against Karvy, Enforcement Directorate, 110 Crore Assets of Karvy Group, Karvy Group 110 Crore Assets, Karvy Group Money Laundering Case News, Karvy Group Money Laundering Case Latest News, Karvy Group Money Laundering Case Latest Updates, Karvy Group Money Laundering Case Live Updates, Mango News, Mango News Telugu,

ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ‘కార్వీ’ గ్రూప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి షాక్ ఇచ్చింది. ఈ మేరకు ‘కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్’ (కేఎస్‌బీఎల్)పై మనీలాండరింగ్ కేసులో కార్వీ గ్రూప్‌కు చెందిన రూ.110 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇక అటాచ్ చేసిన ఆస్తులలో భూమి, భవనాలు, షేర్ హోల్డింగ్‌లు, నగదు, విదేశీ కరెన్సీ మరియు ఆభరణాల రూపంలో పలు ఆస్తులు ఉన్నాయి. కేఎస్‌బీఎల్ మరియు దాని చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి మరియు ఇతరులపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.

కాగా ఇప్పటికే ఈ కేసులో రూ.1,984.84 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. పార్థసారథి, గ్రూప్ సిఎఫ్‌ఒ హరికృష్ణలను ఈడీ గతంలో అరెస్టు చేయగా, వారు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. దాదాపు రూ. 2,800 కోట్ల విలువైన తమ ఖాతాదారుల షేర్లను అక్రమంగా తాకట్టు పెట్టి కార్వీ గ్రూప్ పెద్ద మొత్తంలో రుణాలు పొందిందని హైదరాబాద్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆదేశాల మేరకు క్లయింట్ సెక్యూరిటీలను విడుదల చేసిన తర్వాత రుణాలు నిరర్థక ఆస్తులుగా మార్చారు. ఆ తర్వాత, క్వారీ గ్రూప్ యొక్క మొత్తం నియంత్రణలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి కార్యనిర్వాహకుల సమితి ద్వారా రుణాలు మళ్లించబడ్డాయని నిఘా సంస్థలు గుర్తించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 2 =