
వాతావరణంలో పెరుగుతున్న శబ్దం అందరి జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఇది పిల్లల మెదడు పైన కూడా తీవ్రమైన హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అవును..పెరుగుతున్న శబ్దం మనుషుల చెవులకు మాత్రమే కాదని.. చిన్న పిల్లలకు కూడా హాని కలిగిస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. ట్రాఫిక్, ఇతర సోర్సెస్ నుంచి వచ్చే శబ్దం వల్ల పిల్లల ఏకాగ్రతతో పాటు, అభ్యాస సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది పిల్లల చదువులో సమస్యలను కలిగిస్తుందనే షాకింగ్ వార్తను తాజా అధ్యయనం వెల్లడించింది.
జర్మనీలోని మ్యూనిచ్‌లో గల హెల్మ్‌హోల్ట్జ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ సైంటిస్టులు ఈ అధ్యయనం చేశారు. 5 నుంచి 12 ఏళ్ల వయస్సున్న 500 మందికి పైగా పిల్లలపై అధ్యయనం చేసారు. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సౌండ్స్‌తో కూడిన వాతావరణంలో ఈ పిల్లలందరినీ చదువుకొని కొన్ని పనులను పూర్తి చేయవలసిందిగా కోరారు. వాతావరణంలో ఎక్కువ శబ్దాల మధ్య ఉన్న పిల్లలు ఏకాగ్రత, అభ్యాసానికి సంబంధించిన పనులపై తక్కువ పని చేస్తున్నట్లు అధ్యయనం తేల్చింది. శబ్దం పిల్లల జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను తగ్గించడమే కాకుండా ..సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కూడా బలహీనపరిచినట్లు అధ్యయనంలో తేలింది.
శబ్దం మెదడులో ఒత్తిడిని కలిగిండం వల్ల ఏకాగ్రతకు, అభ్యాస ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని అధ్యయన కర్తలు అంటున్నారు. శబ్దం వల్ల ఏకాగ్రత కుదుర్చుకోవడానికి మెదడు చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల అలసట, చిరాకు, తలనొప్పి కూడా వస్తాయి. పిల్లల ఆరోగ్యం, చదువుపై శబ్దాలు ముఖ్యమైన నెగెటివ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. మొత్తంగా శబ్ద కాలుష్యం మనుషుల చెవులకు మాత్రమే కాకుండా, పిల్లల మానసిక వికాసాన్ని కూడా నెగెటివ్ ప్రభావితం చేస్తుందని ఇది అధ్యయన కర్తలు చెబుతున్నారు.
అధ్యయనం చెప్పిన దాని ప్రకారం పాఠశాలలు, నివాస ప్రాంతాలలో శబ్దం స్థాయిలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని అధ్యయనకర్తలు సూచించారు. అలాగే, పిల్లలను శబ్దం నుంచి రక్షించి.. వారికి ఇంట్లో నిశ్శబ్ద వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల అభివృద్ధి, విద్య గురించి ఆందోళన చెందుతున్న పేరెంట్స్, టీచర్లు కూడా ఈ విషయంపై దృష్టి సారించాలి. శబ్దాలల నుంచి పిల్లలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ