జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు బిగ్ షాక్.. భారీగా పతనమైన షేర్లు

Big Shock for Zee Entertainment Shares Fell Heavily, Big Shock for Zee Entertainment, Shares Fell Heavily, Zee Entertainment Shares Fell Heavily, Zee Entertainment, ZEE, Sony India, ZEE Shares, Zee Stock Update, Latest Zee Entertainment Shares News, Zee Shares Downfall, Share Market, Indian Stock Market, Mango News, Mango News Telugu
Zee entertainment, ZEE, Sony India, ZEE shares, Zee stock update

దిగ్గజ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ కంపెనీ షేర్లు పేకమేడలా కుప్పకూలిపోయాయి. ఒక్క ప్రకటన జీ సంస్థకు భారీ నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఒక్కరోజులోనే ఇంట్రాడేలో జీ షేరు విలువ ఏకంగా 30 శాతానికి పైగా పతనమై.. రూ.162.25 వద్ద జీవనకాల కనిష్ఠానికి చేరుకుంది.  జీ షేరు వ్యాల్యూ 52 వారాల కనిష్ట విలువకు పడిపోయింది. దీంతో జీ కంపెనీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంతలా జీ షేరు వ్యాల్యూ పడిపోవడంతో మదుపర్లు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.

గతంలో జీ కంపెనీతో జపాన్‌కు చెందిన సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా సంస్థ అతి పెద్ద డీల్‌ను కుదుర్చుకుంది. జీ, సోనీ కలిసి మెగా ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా రూపొందించాలని.. దాదాపు 10 బిలియన్ డాలర్లకు ఈ విలీన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఇటీవల ఆ డీల్‌ను సోనీ సంస్థ రద్దు చేసుకుంది. ఈ మేరకు సోమవారం ఒప్పంద రద్దు లేఖను సోనీ సంస్థ జీకి పంపించింది. డీల్‌లోని షరతులు నెరవేరకపోవడంతోనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

అంతేకాకుండా విలీన ఒప్పంద నిబంధనల ఉల్లంఘన కొంద బ్రేక్ అప్ రుసుము రూ. 750 కోట్లు చెల్లించాలని జీ సంస్థకు సోనీ ఇండియా నోటీసులు ఇచ్చింది. ఈ ఎఫెక్ట్ జీ షేర్లపై పడింది. మంగళవారం 10 శాతం నష్టంతో రూ. 208.30 వద్ద ప్రారంభమైన జీ స్టాక్.. క్రమక్రమంగా అది 30 శాతం నష్టానికి చేరుకుంది. ఒక్కరోజులోనే స్టాక్ ధర 30 శాతం పడిపోవడంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ కూడా వేల కోట్లు కోల్పోయింది. అటు పలు బ్రోకరేజీ సంస్థలు కూడా జీ స్టాక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + nine =