ఆటో బుకింగ్‌ను రద్దు చేశారన్న కోపంతో ఓ యువతిని అసభ్యంగా తిట్టి, చెంపపై కొట్టిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రైడ్ క్యాన్సల్ చేసినందుకు మహిళ అని కూడా చూడకుండా ఆమెతో దుర్భాషలాడాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆటోడ్రైవర్ దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సర్వత్రా దుమారం రేపుతోంది. దాడికి గురైన బాధితురాలు నీతి వీడియోను, ఘటనకు సంబంధించిన వివరాలను, ఆటో డ్రైవర్ నిర్లక్ష్యపు ప్రవర్తనను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. అనంతరం ఆటో డ్రైవర్ ముత్తురాజ్‌ను మాగడి రోడ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పీక్ అవర్స్ కారణంగా బాధితురాలు, ఆమె స్నేహితురాలితో కలిసి ఒకేసారి రెండు ఓలా ఆటోలు బుక్ చేసుకున్నారు. ఇంతలో ముందుగా వచ్చిన ఆటోలోనే ఇద్దరు ఎక్కి మరో ఆటో బుకింగ్ రద్దు చేశారు. ఇంతలో పికప్ లొకేషన్‌కు వెళ్లిన ముత్తురాజ్ బుకింగ్ రద్దు చేయడాన్ని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి గొడవగా మారిందని పోలీసులు తెలిపారు.
వీడియోలో ఏముంది?
ముత్తురాజ్ మాట్లాడుతూ.. ‘‘నేను ఆటో బుక్ ని యాక్సెప్ట్ చేసి ఇక్కడకు వచ్చి వేచి ఉన్నాను. ఇప్పుడు మరో ఆటో ఎక్కితే ఏం చేయాలి. ఆటో గ్యాస్ మీ తండ్రి ఇస్తాడా అని అన్నారు. దీనిపై యువతి స్పందిస్తూ.. ‘అర్జెంట్‌గా వెళ్లిపోవాలి కాబట్టి క్యాన్సిల్ చేశాను అని బదులిచ్చింది. దీంతో యువతిపై ముత్తురాజ్ అనరాని మాటలతో దుర్భాషలాడాడు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ తీసుకుని యువతి చెంపపై కొట్టి అసభ్యంగా ప్రవర్తించాడు.
యువతి ఆరోపణలేంటి?
‘‘నా ఫ్రెండ్ క్లాస్ మిస్ కాకూడదని రెండు ఆటోలు బుక్ చేశాను. అందుకే ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి మొబైల్ ఫోన్ లాక్కొని దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన ఇతర ఆటో డ్రైవర్లు మౌనంగా ఉండిపోయారు. అదృష్టవశాత్తూ ఆటో డ్రైవర్ మమ్మల్ని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. అలాగే ఆటోడ్రైవర్ల తీరును సహించేది లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఫిర్యాదు చేసినా డ్రైవర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది.
ఏడీజీపీ అలోక్ కుమార్ కూడా ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండించారు. అలాగే ఇలాంటి ఆటో డ్రైవర్ వల్ల మొత్తం ఆటో డ్రైవర్లకే చెడ్డ పేరు వస్తుంది. సంబంధిత పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. ఘటనను గమనించిన వెంటనే ఆటోను సీజ్ చేసి డ్రైవర్ ముత్తురాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసులు తెలిపారు.
Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7
— Niti (@nihihiti) September 4, 2024