ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు పొగమంచు రోజురోజుకు పెరిగిపోతుంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచీ 481కిచేరుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఢిల్లీలో తాజాగా ఆరెంజ్ అలర్జ్ జారీ చేశారు. నగరాన్ని పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో 150 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి తలెత్తింది.
అయితే కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 490 అంతకంటే ఎక్కువ వద్ద నమోదయినట్లు అధికారులు తెలిపారు. అలాగే నోయిడాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 384 వద్ద, గురుగ్రామ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 468 వద్ద నమోదయినట్లు అధికారులు చెప్పారు. ఈ నగరాల్లో కాలుష్య పరిస్థితి అధ్వాన్యంగా ఉండంటో..దీనివల్ల ఢిల్లీ-NCR ప్రాంతంలో ఆరోగ్య సంబంధిత ముప్పులు కూడా పెరిగినట్లు అధికారులు గుర్తించారు.
గాలి నాణ్యతలో ఈ క్షీణత వల్ల, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఫోర్త్ స్టెప్ అయిన GRAP-4 ఢిల్లీ-NCR ప్రాంతంలో అమలు చేశారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ , ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన ఈ ఫోర్త్ స్టెప్ , వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి అవసరమైన కఠినమైన చర్యలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 కంటే ఎక్కువ ఉన్నప్పుడు..GRAP- 4 కింద, నిర్మాణ పనులు నిలిపివేయడం, నిర్మాణ స్థలం నుంచి దుమ్ము ఎగరకుండా కఠిన చర్యలు తీసుకోవడం, సిటీలో తిరిగే వెహికల్స్ సంఖ్యను తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఇటు సోమవారం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో దట్టమైన పొగమంచును అంచనా వేసిన భారత వాతావరణ విభాగం . . దీనిని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. IMD ప్రకారం, పొగమంచు వల్ల దృశ్యమానత 200 మీటర్లకు పడిపోవచ్చని చెప్పింది.
ఇది రోడ్డు, రైలు, విమాన ట్రాఫిక్‌ను ప్రభావితం చేయొచ్చు. పగటిపూట పొగమంచు వల్ల రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. విమాన, రైల్వే ప్రయాణాలకు సంబంధించి ఎటువంటి ఆలస్యం లేదా అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు సమాచారం పొందాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.