గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు (సెప్టెంబర్ 29, బుధవారం) జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, పలు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతుల కోసం జనసేన నిర్వహించే శ్రమదానం కార్యక్రమం విధివిధానాలను కూడా ఈ సమావేశంలో చర్చించి వెల్లడించనున్నారు. అలాగే క్షేత్ర స్థాయి నుంచీ పార్టీ చేపట్టే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు. ఇక పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా కమిటీ సభ్యులు, ఇటీవల పార్టీ నుంచి గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ