దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం కూడా పెరిగాయి. వరుసగా పదకొండో రోజు కూడా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో వినియోగదారులపై భారం పడుతుంది. ఇవాళ పెట్రోల్‌పై లీటరుకు 55 పైసలు, డీజిల్‌పై లీటరుకు 60 పైసలు ధర పెరిగింది. పెరిగిన ధరలకు తోడు పలు రాష్ట్రాల్లో స్థానిక పన్నులు కూడా అదనంగా కలవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ సంవత్సరంలోనే గరిష్ఠానికి చేరుకుంటున్నాయి. కాగా ఈ 11 రోజుల్లోనే మొత్తంగా పెట్రోల్ పై రూ.6.02, డీజిల్ రూ.6.40 మేరకు ధరలు పెరిగాయి.
ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు (లీటరుకు):
- న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ.77.28, డీజిల్ రూ.75.69
- కలకత్తా : పెట్రోలు ధర రూ.79.08, డీజిల్ రూ.71.38
- ముంబై : పెట్రోలు ధర రూ.84.15, డీజిల్ రూ.74.32
- చెన్నై : పెట్రోలు ధర రూ.80.86, డీజిల్ రూ.73.69
- హైదరాబాద్: పెట్రోలు ధర రూ.80.22, డీజిల్ రూ.74.07
- బెంగళూరు: పెట్రోలు ధర రూ.79.79, డీజిల్ రూ.72.07
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu