video: అందరూ చూస్తుండగానే అదుపుతప్పిన విమానం.. అంతలోనే అగ్నిప్రమాదం..

Plane Loses Control After Landing What Really Happened

కారణం తెలియని పరిస్థితిలో, విమానం ల్యాండ్ అయిన వెంటనే పైలట్ అదుపు కోల్పోవడంతో రన్‌వేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కెనడాలోని టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అమెరికాలోని మిన్నెపొలిస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ఈ ప్రమాదానికి గురైంది.

ప్రమాదం తర్వాత భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం సంభవించిన సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన కారణంగా టొరంటో పియర్‌సన్ విమానాశ్రయంలో తాత్కాలికంగా విమాన రాకపోకలను నిలిపివేశారు. మొత్తం 40కిపైగా విమానాల షెడ్యూల్‌ ఈ ఘటన ప్రభావితమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ప్రాణాపాయం లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇటీవల విమాన ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా బ్రెజిల్, అమెరికాల్లో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రయాణికుల్లో భయం నెలకొంది. గడచిన పదిరోజుల్లోనే నాలుగు ప్రధాన విమాన ప్రమాదాలు సంభవించాయి, వీటిలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఆరిజోనా స్కాట్స్డేల్ విమానాశ్రయంలో రెండు ప్రైవేట్ జెట్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరుస ఘటనలతో విమాన భద్రతపై అనేక ప్రశ్నలు ఉత్థిపత్తి అవుతున్నాయి. ఇప్పుడే టొరంటోలో మరో ప్రమాదం జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది.