జూన్ 21 న జాతినుద్దేశించి పీఎం మోదీ ప్రసంగం

Corona Outbreak, Coronavirus Pandemic, COVID-19, Modi Address Nation, Modi Video Conference, PM Modi, PM Modi Address Nation, PM Modi Video Conference, PM Modi will Address the Nation, pm narendra modi, PM Narendra Modi Address Nation, Prime Minister Narendra Modi

జూన్ 21, ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ నుంచి పీఎం మోదీ ప్రసంగం చేయనున్నారు. ఈ ప్రసంగంలో యోగా విశిష్టత గురించి మోదీ వివరించనున్నారు. అలాగే పీఎం మోదీ చేసే కొన్ని యోగాసనాలను కూడా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశముంది.

మరోవైపు 15 రాష్ట్రాల సీఎంలతో జూన్ 17 న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా దేశంలో లాక్‌డౌన్ ల దశ ముగిసి, అన్ లాక్ ల దశ ప్రారంభమయిందని ప్రధాని మోదీ వెల్లడించారు. “దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్‌డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తున్నది. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని” ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu