ఢిల్లీలో ఈడీ ఎదుట హాజరైన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్

ED Conducts Raids on KPCC President DK Shiv Kumar, DK Shivakumar, KPCC President DK Shiv Kumar, ED Conducts Raids on KPCC President, ED Raids on KPCC President, KPCC President, KPCC President DK Shiv Kumar, Mango News , Mango News Telugu, ED Raids on DK Shiv Kumar, ED Case Karnataka Congress Chief Dk Shivakumar , CBI Raids Karnataka Congress Chief Shivakumar, Karnataka Congress Chief Shivakumar, Congress Chief Shivakumar, Shivakumar, KPCC President Latest News And Updates

కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇవాళ ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఒక మనీలాండరింగ్ కేసుకి సంబంధించి ఆయన సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు ఎదుర్కొన్నారు. ఎపిజె అబ్దుల్ కలాం రోడ్‌లోని ఫెడరల్ ఏజెన్సీ కార్యాలయానికి ఈ మధ్యాహ్నం వచ్చిన ఆయన వెంట కొంతమంది అనుచరులు, లాయర్లు ఉన్నారు. కాగా గత వారం శివకుమార్‌కు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. ఏజెన్సీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. అయితే దీనిపై శివకుమార్‌ స్పందించారు. ‘అసెంబ్లీ సెషన్‌ల మధ్యలో, వారు మళ్లీ నాకు హాజరుకావాలని ఈడీ సమన్లు ​​జారీ చేశారు. నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని శివకుమార్‌ ట్వీట్‌ చేశారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న ఈ సమయంలో విచారణకు రావాలనడంపై కొంచెం అసహనం వ్యక్తం చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో శివకుమార్‌పై సీబీఐ కేసును పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఏజెన్సీ అతనికి తాజా సమన్లు ​​జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక మరో మనీలాండరింగ్ కేసులో 2019 సెప్టెంబర్ 3న ఈడీ శివకుమార్‌ను అరెస్టు చేసింది. ఢిల్లీ హైకోర్టు అదే సంవత్సరం అక్టోబర్‌లో అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది మేలో ఏజెన్సీ అతనిపై దాఖలైన ఆదాయపు పన్ను శాఖ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నమోదు చేసిన ఈ కేసులో అతనితో పాటు ఇతరులపై చార్జ్ షీట్ దాఖలు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =