మహారాష్ట్రలో కీలక పరిణామం, హోంమంత్రి పదవీకి రాజీనామా చేసిన అనిల్‌ దేశ్‌ముఖ్‌

Anil Deshmukh, Anil Deshmukh News, Anil Deshmukh Resigns, Anil Deshmukh Resigns as Maharashtra Home Minister, home minister Anil Deshmukh resigns, Maharashtra, Maharashtra Home Minister, Maharashtra home minister Anil Deshmukh, Maharashtra home minister Anil Deshmukh resigns, Maharashtra Lockdown, Maharashtra News, Maharashtra Political News, Maharashtra Political Updates, Mango News

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు సమర్పించారు. ముందుగా గతనెలలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేకు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్ లేఖ రాశారు. ముంబయిలోని పబ్‌లు, రెస్టారెంట్లు మరియు ఇతర మార్గాల ద్వారా నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు అనిల్‌ దేశ్‌ముఖ్ లక్ష్యంగా పెట్టారని సీఎంకు రాసిన లేఖలో పరమ్‌బీర్‌ సింగ్ పేర్కొన్నారు. అనంతరం ఈ విషయంలో విచారణ జరపాలని పరమ్‌బీర్‌ సింగ్ సహా ఇద్దరు న్యాయవాదులు బాంబే హైకోర్టులో పెటిషన్స్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై సోమవారం నాడు బాంబే హైకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసింది. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ పై ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై15 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ను బాంబే హైకోర్టు ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఆధారాలు లభిస్తే సీబీఐ డైరెక్టర్ తదుపరి చర్యపై నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుపై బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన గంటల్లోనే హోంమంత్రి పదవికి అనిల్ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =