కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో ఈ లాక్‌డౌన్ గడువు ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజు (మే 12, మంగళవారం) రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ఈ రోజు ట్విటర్‌లో వెల్లడించింది. ఈ ప్రసంగంలో లాక్‌డౌన్ పై ప్రధాని మోదీ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం తదితర అంశాలపై మే 11, సోమవారం నాడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర, బీహార్, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడిగించాలని కోరగా, మరి కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దశలవారీగా ఎత్తివేయాలని, ఇతర రాష్ట్రాలు కంటైన్మెంట్ జోన్లతో సహా ఈ అంశంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాని మోదీ ప్రసంగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
Shri @narendramodi will be addressing the nation at 8 PM this evening.
— PMO India (@PMOIndia) May 12, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
































































