‘ఆపరేషన్ మేఘ్ చక్ర’.. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సీబీఐ ఆకస్మిక దాడులు

CBI Conducts Operation Megh Chakra The Biggest Ever Countrywide Raids Against Online Child Abusing Content, CBI Conducts Operation Megh Chakra, Biggest Ever Countrywide Raids, Online Child Abusing Content, Operation Megh Chakra, Mango News, Mango News Telugu, CBI Megh Chakra, CBI Operation Megh Chakra, Megh Chakra CBI Operation, CBI Latest News And Updates, Central Bureau of Investigation, CBI Raids, CBI

కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం 19 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతం సహా మొత్తం 56 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. ‘ఆపరేషన్ మేఘ్ చక్ర’ పేరుతో నిర్వహిస్తున్న ఈ దాడులలో తెలుగు రాష్ట్రాలలోని పలువురి ఇళ్లల్లో సోదాలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో పిల్లలపై బాలల లైంగిక దోపిడీ, పోర్నోగ్రఫీపై ఇంటర్‌పోల్ అందజేసిన సమాచారం ఆధారంగా దేశవ్యాప్తంగా దాడులు చేస్తోంది. కాగా ఇంటర్‌పోల్, న్యూజిలాండ్ అందజేసిన సమాచారం సింగపూర్ నుంచి భారత దేశానికి చేరినట్లు నిఘాసంస్థ గుర్తించింది. ఇందులో చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మెటీరియల్‌ను పోస్ట్ చేసిన మరియు సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తుల సమాచారం ఉన్నట్లుగా గుర్తించింది.

ఇక దేశంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసిన మొదటి ఏజెన్సీ సీబీఐ, అలాగే ఇంటర్‌పోల్‌కు సీబీఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దీంతో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కేసుల్లో ఈ డేటాను ఉపయోగించుకుని దర్యాప్తు చేయడానికి ఇండియాతో పాటు 64 సభ్య దేశాలకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మైనర్‌లతో అక్రమ లైంగిక కార్యకలాపాల ఆడియో-విజువల్స్‌ను ప్రసారం చేయడానికి పెడ్లర్లు ఉపయోగించే క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాలపై ఈ ఆపరేషన్ నిర్వహిస్తోందని ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు. ఇక ‘ఆపరేషన్ మేఘ్ చక్ర’ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌ నిరోధానికై నిర్వహిస్తున్న అతి పెద్ద ఆపరేషన్‌గా వర్ణిస్తున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీపై భారీ అణిచివేతలో భాగంగా గతేడాది చేపట్టిన ‘ఆపరేషన్ కార్బన్’కు కొనసాగింపుగా ఇప్పుడు ‘ఆపరేషన్ మేఘ్ చక్ర’ పేరుతొ దాడులు నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + two =