భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ హౌస్ లాన్ వద్ద బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. అలాగే వీరితో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్ పవార్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
ఇక అంతకుముందు ట్విట్టర్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ‘మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ జయంతి సందర్భంగా తోటి పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి స్మరించుకుంటూ ట్విట్టర్‌లో.. సమాజంలోని అణగారిన, దోపిడీకి గురవుతున్న వర్గాల సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పూజ్య బాబాసాహెబ్‌కు, ఆయన జయంతి సందర్భంగా వందల వందనాలు. జై భీమ్!’ అని తెలిపారు.
I extend my heartiest greetings and best wishes to all fellow citizens on the occasion of the birth anniversary of the architect of our Constitution, Babasaheb Bhimrao Ramji Ambedkar. pic.twitter.com/gQDjMxPGrL
— President of India (@rashtrapatibhvn) April 14, 2023
समाज के वंचित और शोषित वर्ग के सशक्तिकरण के लिए अपना जीवन समर्पित करने वाले पूज्य बाबासाहेब को उनकी जयंती पर शत-शत नमन। जय भीम! pic.twitter.com/yssVzjMpnL
— Narendra Modi (@narendramodi) April 14, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE