జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు

#Article370, 370 article, article 35 a, article 35a and 370, article 35a history, article 35a in kashmir, article 35a jammu and kashmir, article 35a kashmir, article 35a latest news, Article 370, article 370 and article 35a, article 370 debate, article 370 issue, article 370 jammu and kashmir, article 370 kashmir, article 370 kashmiri pandits, article 370 removed, Article 370 Scrapped, Home Minister, J&K Bifurcated Into Two Union Territories, Jammu and Kashmir, jammu and kashmir news, kashmir news, mehbooba mufti latest, mehbooba mufti on article 370, pm narendra modi, what is article 35a, what is article 370

గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏర్పడిన ఉత్కంఠకు తెరతీస్తూ, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హోం మంత్రి అమిత్‌ షా మొదటగా కశ్మీర్‌ రిజర్వేషన్‌ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఆ తరువాత జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకి సంబంధించిన బిల్లును అమిత్ షా ప్రతిపాదించారు. అమిత్ షా ప్రకటనతో రాజ్యసభలో ఒక్కసారిగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపు రాజ్యసభ ప్రసారాలను సైతం నిలిపి వేశారు. అయితే అమిత్ షా ప్రతిపాదన పెట్టిన నిమిషాలలోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆర్టికల్ 370 రద్దు అయినట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన తీర్మానం పెట్టిన వెంటనే, ఆర్టికల్ 35ఏ రద్దుకు కూడ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఎన్నో సంవత్సరాలుగా జమ్మూ కశ్మీర్ కు కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్ ను రెండు భాగాలుగా విభజించింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్, ఎటువంటి చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ ను విభజించారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలోని మిగతా అన్ని రాష్టాల లాగానే కేంద్రప్రభుత్వ పరిధి లోకి వస్తుంది, ఇక నుంచి ప్రభుత్వం పార్లమెంట్ లో చేసే ప్రతి చట్టం జమ్మూ కశ్మీర్ కి కూడ వర్తిస్తుంది.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here