హిందువులంతా పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినం రోజు.. ప్రధాని నరేంద్ర మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి నామినేషన్ వేశారు. అమిత్‌షా,రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు వెంటరాగా.. మే 14న జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో మోదీ నామినేషన్ పత్రాలను సమర్పించారు.సార్వత్రిక ఎన్నికల ఆఖరి దశ అంటే జూన్ 1న పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో వారాణసి ఉంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు… గంగాదేవి భూమిమీదకు దిగివచ్చిన గంగా సప్తమి, పుష్యమి నక్షత్రం కలిసి రావడంతో.. మోదీ మంగళవారం నామినేషన్ వేశారు.
నామినేషన్ వేయడానికి ముందు దశాశ్వమేధ ఘాట్‌లో గంగా స్నానం చేసిన మోదీ.. హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుడి గుడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ప్రార్థనలు చేశారు. అయితే ఏ నేత అయినా నామినేషన్ వేసిన తర్వాత అపిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులు వివరాలు తెలియజేస్తారు కాబట్టి.. మోదీ ఆస్తులపై అలా సర్వత్రా చర్చ సాగుతోంది.
తనకు మొత్తం రూ.3.02 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ప్రధాని మోదీ తన అఫిడవిట్లో ప్రకటించారు. మోదీ ప్రకటించిన అఫిడవిట్ ప్రకారం..తనకి కారు లేదని.. సొంత ఇల్లు లేదని తేలింది. అలాగే భూములుగానీ, షేర్లుగానీ లేవని కనీసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాంటి పెట్టుబడులూ లేవని ఆయన ప్రకటించారు.
అయితే పిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఎస్‌బీఐలో రూ.2.86 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. రూ.2.68 లక్షల విలువ చేసే నాలుగు బంగారు ఉంగరాలతో పాుట, రూ.9.12 లక్షల విలువైన జాతీయ పొదుపు పత్రాలు మాత్రమే మోడీ పెట్టుబడులుగా తెలిపారు. ఇక, ప్రధాని చేతిలో ఉన్న.. 52,920 రూపాయల నగదు ఉన్నట్లు. వారాణసీ, గాంధీనగర్‌లోని రెండు బ్యాంకు ఖాతాల్లో 80,304 రూపాయలు ఉన్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం నుంచి తాను నెలనెలా తీసుకుంటున్న జీతాన్ని, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వస్తున్న వడ్డీని మోదీ తన ఆదాయ వనరులుగా చూపించారు. 2018-19లో తన ఆదాయం రూ.11.14 లక్షలుగా చూపిన ప్రధాని నరేంద్ర మోదీ.. 2022-23లో రూ.23.54 లక్షలుగా చెప్పారు. 2014లో ప్రధాని తన ఆస్తుల విలువను రూ.1.66 కోట్లుగా ..అలాగే 2019లో రూ.2.51 కోట్లుగా మోదీ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY