దేశంలో మరో 132 కరోనా కేసులు నమోదు, రోజువారీ పాజీటివిటీ రేట్ ఎంతంటే?

Covid-19 in India 132 Fresh Positive Cases Reported and Active Cases Reaches to 1820,Covid Deaths,Covid Last 24 Hours, 132 People Tested Positive,Coronavirus In India,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 132 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 11, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,83,994 కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 530750 గా ఉంది. ఫిబ్రవరి 10న 1,29,582 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.10 శాతంగా నమోదైంది. అలాగే వీక్లి పాజిటివిటీ రేటు 0.09 శాతంగా ఉంది.

దేశంలో 1,820 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.81 శాతం:

దేశంలో ప్రస్తుతం 1,820 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 109 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,51,424 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ (41), కర్ణాటక (38), మహారాష్ట్ర (11), తమిళనాడు (7), తెలంగాణ (5) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. కాగా దేశంలోని 19 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదుకాలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =