సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ మరో చరిత్ర సృష్టించారు. అతి పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ ఖాతాలో ప్రధానిని అనుసరిస్తున్న వారి సంఖ్య తాజాగా 100 మిలియన్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో నిలవగా.. ఎక్స్ ద్వారా మోదీ తాజాగా మరో రికార్డు నెలకొల్పారంటూ ఆయన ఫాలోవర్లు ఖుషీ అవుతున్నారు. ఎన్డీఏ కూటమి మద్దతుతో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పీఎం మోదీ నెలకొల్పిన తొలి రికార్డ్ ఇదే కావడం విశేషం. చాలా మంది రాజకీయ నేతలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, తాజాగా మోదీ అందుకున్న రికార్డుతో ఇప్పుడు వారందరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎక్స్‌లో 26.4 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.., ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 27.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు 19.9 మిలియన్ల ఫాలోవర్లు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7.4 మిలియన్ల ఫాలోవర్లు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు 6.3 మిలియన్ల పాలోవర్లు ఉన్నారు.
తేజస్వి యాదవ్‌కు ఎక్స్ ఖాతాలో 5.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు 2.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు ఎక్స్ ఖాతాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 38.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. పోప్ ఫ్రాన్సిస్18.5 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీకి యూట్యూబ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 91 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మోదీ 2009లో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా పాలిటిక్స్ తో పాుట వివిధ సందేశాత్మక పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆకర్షణీయమైన పోస్టులను మోదీ రీపోస్ట్ చేస్తారు. చివరకు సాధారణ పౌరులను కూడా మోదీ అనుసరించడమే కాకుండా.. వారి సందేహాలను తీరుస్తారు.
మోదీ ఇప్పటి వరకూ పెయిడ్ ప్రమోషన్లు, బాట్‌లను ఆశ్రయించలేదు. ఆయన తన ఏ సోషల్ మీడియా ఎకౌంట్‌లో కూడా ఎవరినీ బ్లాక్ చేయలేదు. అంతెందుకు వరుసగా మూడో సారి కూడా బీజేపీ గెలవడానికి సోషల్ మీడియా కూడా ఒక కారణంగానే చెప్పుకోవచ్చు. ఈ విజయంలో మోదీ సోషల్ మీడియా అకౌంట్లు కీలకంగా వ్యవహరించాయన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY