ఢిల్లీలో భారత్-బ్రిటన్ ప్రధానుల భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ

UK Prime Minister Boris Johnson Meets PM Narendra Modi Today in Delhi, Boris Johnson Meets PM Narendra Modi Today in Delhi, UK PM Boris Johnson will Meet Prime Minister Modi Today, Prime Minister Modi, PM Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Boris Johnson India visit, UK Prime Minister Boris Johnson, UK PM Boris Johnson to begin two-day India trip, UK PM Boris Johnson Starts India Tour, UK PM Boris Johnson two-day Tour In India, British Prime Minister Boris Johnson, British Prime Minister, Prime Minister Boris Johnson, Prime Minister Boris Johnson Tour To India, Prime Minister Boris Johnson 2 Days Tour To India, Boris Johnson India visit News, Boris Johnson India visit Latest News, Boris Johnson India visit Latest Updates, Boris Johnson India visit Live Updates, Mango News, Mango News Telugu,

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈరోజు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. శుక్రవారం ఉదయం బోరిస్ జాన్సన్‌కు ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన జాన్సన్ తనకు సాదర స్వాగతం పలికినందుకు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన స్వాగతానికి ధన్యవాదాలు.. మా మధ్య (ఇండియా-యూకే) పరిస్థితులు పూర్వం కంటే ఇప్పుడు మరింత బలంగా ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్ విచ్చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గుజరాత్‌లోని మహాత్మా గాంధీ యొక్క ఐకానిక్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. 1950 తర్వాత సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన బ్రిటన్ తొలి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కావడం విశేషం.

ఈ ఉదయం బోరిస్ జాన్సన్‌ తన ట్విట్టర్ ద్వారా ఇలా తెలిపారు. “ఈ రోజు న్యూ ఢిల్లీలో నా స్నేహితుడు నరేంద్ర మోదీని కలవడానికి ఎదురు చూస్తున్నాను. వాతావరణ మార్పు నుండి ఇంధన భద్రత వరకు, ప్రపంచం నిరంకుశ రాజ్యాల నుండి పెరుగుతున్న బెదిరింపులను ఎదుర్కొంటున్నందున రక్షణ పరంగా మన ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది” అని పేర్కొన్నారు. జాన్సన్ ఇటీవల ఉక్రెయిన్‌కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని రాజధాని నగరం కైవ్‌లో కలిశారు. హింసను అంతం చేయాలని, యుద్ధాన్ని విడనాడాలని యూకే పదేపదే రష్యాకు పిలుపునిస్తోంది. భారతదేశ పర్యటనను ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత, 1 బిలియన్ పౌండ్ల ఒప్పందాన్ని ధృవీకరిస్తూ, జాన్సన్ నిన్న ట్వీట్‌లో నిర్ధారించారు. “ఈ రోజు గుజరాత్‌లో ఫలాలను చూడటానికి ఇది చాలా ఆనందంగా ఉంది. యూకే మరియు భారతదేశంలోని మా స్నేహితుల మధ్య అద్భుతమైన భాగస్వామ్యం. ఈ రోజు మేము మా రెండు దేశాల మధ్య £1 బిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ కొత్త పెట్టుబడులను నిర్ధారించాము. దీనిద్వారా యూకేలో దాదాపు 11,000 కొత్త ఉద్యోగాలను సృష్టించాము” అని వెల్లడించారు. ఈరోజు జాన్సన్ ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కూడా కలవనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =